గణాంకాలు- కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ
2020 మే నెలకు సంబంధించి పారిశ్రామిక ఉత్పత్తి , వినియోగ ఆధారిత సూచిక శీఘ్ర అంచనాలు (ఆధార సంవత్సరం 2011-12=100)
Posted On:
10 JUL 2020 5:30PM by PIB Hyderabad
పారిశ్రామిక ఉత్పత్తి సూచిక (ఐఐపి)కి సంబంధించిన శీఘ్ర అంచనాలు ఆరువారాల తేడాతో ప్రతి నెలా 12 వ తేదీన విడుదల అవుతాయి. ( లేదా 12 వ తేదీ సెలవు రోజు అయితే ఆ ముందురోజు విడుదల అవుతాయి) . వీటిని సోర్సు ఏజెన్సీలనుంచి వచ్చే సమాచారంతో సంకలనం చేస్తారు. ఈ సోర్సు ఏజెన్సీలు ఉత్పాదక ఫ్యాక్టరీలు లేదా సంస్థలనుంచి సమాచారం అందుకుంటాయి.
2. కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం ప్రకటించిన ముందస్తు చర్యలు, దేశవ్యాప్త లాక్‌డౌన్ కారణంగా మెజారిటీ పారిశ్రామిక రంగ సంస్థలు 2020 మార్చి చివరి నుంచి తమ కార్యకలాపాలు నిర్వహించ లేదు.
లాక్‌డౌన్ సమయంలో, ఆతర్వాత షరతులతో కూడిన ఆంక్షల సడలింపుతో , వివిధ వస్తువులను ఉత్పత్తి చేసే సంస్థలపై ఇది ప్రభావం చూపింది. 2020 మే నెలకు ఈ సూచిక 88.4 గా ఉండగా 2020 ఏప్రిల్ నెలలో ఇది 53.6 గా ఉంది. ఆర్థిక వ్యవస్థలో పారిశ్రామిక కార్యకలాపాలు దశలవారీగా పుంజుకున్నాయని ఇది సూచిస్తున్నది.
3. 2020 మే నెలలో స్పందించిన యూనిట్ల సంఖ్య, అంతకుముందు లాక్‌డౌన్ నెలలతో పోలిస్తే మెరుగుపడింది. వెయిటెడ్ రెస్పాన్సు రేటు ఏప్రిల్ 2020 శీఘ్ర అంచనాల కాలానికి 87 శాతం గా ఉండగా , ప్రస్తుతం తొలి రివిజన్ కింద దానిని 91 శాతంగా ఎగువకు సవరించారు.
4. 2020 మే నెలకు పారిశ్రామిక ఉత్పత్తి సూచిక (ఐఐపి) శీఘ్ర అంచనా 2011-12 ఆధార సంవత్సరం వద్ద 88.4 గా ఉంది. గనులు, తయారీ, విద్యుచ్ఛక్తి రంగాలకు సంబంధించి పారిశ్రామిక ఉత్పత్తి సూచికలు 2020 మే నెలకు వరుసగా 87.0,82.4, 149.6 గా ఉంటూ వచ్చాయి.(స్టేట్‌మెంట్ -1). శీఘ్ర అంచనాలు ఆ తర్వాతి ప్రకటనలలో, ఐఐపి సవరణ విధానాలకు అనుగుణంగా మార్పులకు గురౌతాయి.
5. వినియోగ ఆధారిత వర్గీకరణ ప్రకారం,2020 మే నెలకు, ప్రాథమిక సరకుల సూచికలు 105.5 గా , కాపిటల్ గూడ్సుకు 37.1 , ఇంటర్మీడియట్ గూడ్సుకు 77.6 . తయారీ, నిర్మాణ రంగ సరకులకు 84.1గా (స్టేట్‌మెంట్ 3) ఉన్నాయి. ఇంకా, కన్సూమర్ డ్యూరబుల్సు, కన్సూమర్ నాన్ డ్యూరబుల్సుల సూచికలు 2020 మే నెలకు వరుసగా 42.2, 132. 3గా ఉన్నాయి.
6. సెక్టోరల్ స్థాయిలో 2020 మే నెలకు పారిశ్రామిక ఉత్పత్తి సూచిక శీఘ్ర అంచనాల స్టేట్‌మెంట్లు, రెండంకెల స్థాయి జాతీయ పారిశ్రామిక వర్గీకరణ (ఎన్.ఐ.సి-2018), వినియోగ ఆధారిత వర్గీకరణలను స్టేట్ మెంట్ 1,2,3 లలో వరుసగా ఇవ్వడం జరగింది.
2020 ఏప్రిల్ నెలకు సంబంధించి ఐఐపి విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్న దాని ప్రకారంగా, 2020 మే నెల పారిశ్రామిక ఉత్పత్తి సూచి (ఐఐపి) ని కోవిడ్ మహమ్మారికి ముందు గల నెలలతో పోల్చడం సరికాదు.
7.2020 మే నెలకు సంబంధించిన ఐఐపి శీఘ్ర అంచనాలతో పాటుగా , 2020 ఏప్రిల్ నెల సూచికలు తొలి సవరణకు గురికాగా, సోర్సు ఏ జెన్సీల నుంచి తాజా సమాచారం రావడంతో 2020 ఫిబ్రవరికి సంబంధించిన సూచికలు తుది సవరణకు కూడా గురయ్యాయి.
2020 మే నెలకు సంబంధించిన శీఘ్ర అంచనాలను 86 శాతం వెయిటెడ్ రెస్సార్సు రేటు వద్ద సంకలనం చేయడం జరిగింది. 2020 ఏప్రిల్‌కు సంబంధించిన సూచికలను 91 శాతం వెయిటెడ్ రెస్పాన్సు వద్ద సవరించారు. 2020 ఫిబ్రవరి తుది సవరణను 92 శాతం వెయిటెడ్ రెస్పాన్సు రేటు వద్ద సవరించారు.
8. జూన్ 2020 కి సంబంధించిన సూచికను 2020 ఆగస్టు 11 మంగళవారం నాడు విడుదల చేస్తారు.
గమనిక:-
ఈ పత్రికా ప్రకటనకు సంబంధంచిన సమాచారం మంత్రిత్వశాఖ వెబ్‌సైట్ http://www.mospi.nic.in లో కూడా అందుబాటులో ఉంటుంది. హిందీ ప్రెస్ రిలీజ్ http://mospi.nic.in/hi వెబ్‌సైట్ పై అందుబాటులో ఉంటుంది.
(Release ID: 1637852)
Visitor Counter : 254