రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

హిందుస్తాన్ ఆర్గానిక్ కెమికల్స్ వడీ రద్దుకు కాబినెట్ ఆమోదం

Posted On: 20 MAY 2020 2:19PM by PIB Hyderabad

హిందుస్తాన్ ఆర్గానికి కెమికల్స్ లిమిటెడ్ (హెచ్ ఒ సి ఎల్) కు రూ. 7.59 కోట్ల వడ్దీ మాఫీ చేయటానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కాబినెట్ కమిటీ ఆమోద ముద్ర వేసింది. ఇది 2005 మార్చి 31 నాటి నుంచి బకాయిలకు వర్తిస్తుంది. అదే విధంగా హెచ్ ఒ సి ఎల్ సంస్థ విషయంలో 2005 మార్చి 31 వరకు అపరాధ వడ్డీ, వడ్డీ మీద వడ్దీ రద్దు చేస్తూ ఆర్థిక వ్యవహారాల కాబినెట్ కమిటీ తీసుకున్న పునరావాస పాకేజ్ నిర్ణయానికి కూడా ఆమోదం తెలియజేసింది.

ఇది దాదాపు పదేళ్ళ నాటి అంశం కాబట్టి ప్రభుత్వ ఖాతాల్లోనూ, హెచ్ ఓ సి ఎల్ లోనూ సంబంధిత మొత్తం రూ. 7.59  కోట్లు  ఇప్పటికే రద్దు చేద్దు చేసి ఉండటం,  ఇందులో ఇమిడి ఉన్న సొమ్ము మరీ ఎక్కువకాకపోవటం ఈ నిర్ణయానికి దారితీశాయి. ఈ దశలో 2005  మార్చి 31 నాటికి భారత ప్రభుత్వ ఋణాల మీద ఈ దశలో రూ.7.59  కోట్ల వడ్డీ రద్దును క్రమబద్ధీకరించటం ఈ దశలో ఆచరణయోగ్యం అవుతుంది. పాత తేదీనుంచి రద్దు అమలు చేయటం వల్ల ఈ విషయంలో కాగ్ ఆడిట్ అభ్యంతరాన్ని కూడా హెచ్ ఒ సి ఎల్ సంస్థ  పరిష్కరించుకోగలుగుతుంది.

 

******



(Release ID: 1625437) Visitor Counter : 112