ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
సమాజంలో సార్స్-కోవ్-2 (కోవిడ్-19) సంక్రమణ వ్యాప్తి ధోరణిని పర్యవేక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో జాతీయ పౌష్టికాహార సంస్థ (ఎన్.ఐ.ఎన్) కమ్యూనిటీ ఆధారిత సెరో-నిఘా ను ప్రారంభించింది -
प्रविष्टि तिथि:
15 MAY 2020 3:45PM by PIB Hyderabad
కరోనా వైరస్ వ్యాధి (కోవిడ్-19) ఒక మహమ్మారిగా ఉద్భవించింది. తీవ్రమైన శ్వాసకోశ సిండ్రోమ్ కరోనావైరస్ 2 (సార్స్ కోవ్-2) కారణంగా ఈ వ్యాధి ఇప్పుడు 200 కి పైగా దేశాలకు వ్యాపించింది. సార్స్-కోవ్-2 లక్షణాలు వ్యాధి సంక్రమణకు కారణమవుతాయని గమనించబడింది, అందువల్ల క్రియాశీల కేసు కనుగొనడం, పరీక్షించడం మరియు కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం సెరో-నిఘాను గట్టిగా సిఫార్సు చేయబడింది. అదేవిధంగా, యాంటీబాడీ ఆధారిత సెరో-పాజిటివిటీ యొక్క నిఘా ఇచ్చిన జనాభాలో సంక్రమణ వ్యాప్తి యొక్క పరిధిని సూచిస్తుంది మరియు ప్రజారోగ్య ఉపశమన చర్యలను బలోపేతం చేయడానికి ఆధారాన్ని ఏర్పరుస్తుంది. గృహ ఆధారిత అధ్యయనాలు, ప్రసారంలో వ్యాధి లక్షణాలు లేని మరియు తేలికపాటి ఇన్ఫెక్షన్ల పాత్రపై ఆధారాలను సృష్టించగలవు.
కమ్యూనిటీ-ఆధారిత జిల్లా స్థాయి సెరో-నిఘాను నిర్వహించడానికి, మరియు సాధారణ జనాభాలో సార్స్-కోవ్-2 సంక్రమణ ప్రసారాన్ని పర్యవేక్షించడానికి, ఐ.సి.ఎం.ఆర్. భారత దేశ వ్యాప్త సర్వేను ప్రారంభించింది. ఇందుకోసం తెలంగాణలో మూడు జిల్లాలు - జనగావ్, కామారెడ్డి, నల్గొండ జిల్లాలను ఎంపిక చేశారు. ప్రతియీ జిల్లాలో 10 గ్రామాలను అక్కడక్కడా ఎంపికచేస్తారు. అధ్యయనంకోసం 18 సంవత్సరాల వయస్సు పైబడిన 40 మంది పెద్ద వారిని కవర్ చేస్తారు. అవే గ్రామాల్లో 4 రౌండ్లలో అధ్యయనం జరుగుతుంది. (క్రాస్ సెక్షనల్ అధ్యయనం పునరావృతం వుతుంది ). సమాజంలో సార్స్-కోవ్-2 సంక్రమణ యొక్క సెరో-ప్రాబల్యం నిర్ణయించడానికి , ప్రారంభ సర్వే ఒక ప్రాధమిక సమాచారంగా ఉపయోగపడుతుంది, కాగా, సమాజంలో సంక్రమణ పోకడలను పర్యవేక్షించడానికి తరువాతి రౌండ్లు సహాయపడతాయి. కమ్యూనిటీ స్థాయిలో కోవిడ్-19 సంక్రమణ భారాన్ని నిర్ణయించడానికి మరియు సార్స్-కోవ్-2 సంక్రమణ ప్రసారంలో ఉన్న పోకడలను పర్యవేక్షించడానికి జనాభా ఆధారిత సెరో- సాంక్రమిక వ్యాధులకు సంబంధించిన అధ్యయనాలు మనకు సహాయపడతాయి. తగిన నియంత్రణ చర్యల రూపకల్పన మరియు అమలులో మార్గనిర్దేశం చేయడానికి ఈ అధ్యయన ఫలితాలు ఉపయోగపడతాయి. సాధారణ జనాభా మరియు ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో సార్స్-కోవ్-
సంక్రమణ సెరో-ప్రాబల్యం యొక్క ధోరణిని అంచనా వేయడం మరియు పర్యవేక్షించడం, సార్స్-కోవ్-2 సంక్రమణకు సామాజిక-జనాభా ప్రమాద కారకాలను నిర్ణయించడం మరియు సాధారణ జనాభా మరియు హాట్ స్పాట్ నగరాల్లో సంక్రమణ యొక్క భౌగోళిక వ్యాప్తిని వివరించడం ఈ సెరో-నిఘా యొక్క లక్ష్యాలు.
ఇందు కోసం, జాతీయ పౌష్టికాహార సంస్థ (ఎన్.ఐ. ఎన్) రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మూడు జిల్లాల్లోని 30 గ్రామాల్లో ఇంటింటి సర్వేను ప్రారంభించింది. ఐ.సి.ఎం.ఆర్.-ఎన్.ఐ.ఎన్ నిఘా సజావుగా జరిగేలా రాష్ట్ర ఆరోగ్య శాఖ / జిల్లా అధికారులు చురుకుగా పాల్గొంటారు.
*****
(रिलीज़ आईडी: 1624064)
आगंतुक पटल : 266
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English