శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
ఇంట్లోనే తయారీతో తీరనున్న మాస్క్‌ల కొరత
మాస్క్‌లు ఇంట్లోనే తయారు చేసుకోవడం సులభం, ఉపయోగించడం, పునర్వినియోగం సులభం
సులభంగా అందుబాటులో మాస్క్‌ల తయారీ వస్తువులు, డిజైన్లు
Posted On:
02 APR 2020 11:33AM by PIB Hyderabad
ముఖానికి వేసుకునే మాస్క్‌లు ఎక్కడ నుంచి తెచ్చుకోవాలని మీరు కంగారుపడుతున్నారా? భారత ప్రభుత్వానికి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వయిజర్ మీకోసం ఒక వినూత్నపరిష్కారాన్ని సూచిస్తున్నారు. అదే ఇంట్లోనే తయారుచేసుకునే మాస్క్. మాస్క్ వేసుకోవాలని అనుకున్నా, మాస్క్ దొరకలేదని అనుకునే వారి కోసం ఇది. ఈ మాస్క్‌లను వాడు కోవడమే కాదు. తిరిగి ఉతికి వీటిని పునర్ వినియోగించవచ్చు నని డాక్టర్ శైలజా వైద్య గుప్త, సీనియర్ అడ్వయిజర్ , భారత ప్రభుత్వ ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వయిజర్ సూచిస్తున్నారు.
మాస్క్‌లు, శానిటైజర్ల కొరత నిజం.కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తి కారణంగా ప్రజలు పరిశుభ్రతా వస్తువులు, ప్రత్యేకించి మాస్క్‌లు , చేతులు కడుగుకునే శానిటైజర్లు ఆతృతతో కోనుగోళ్లు చేపట్టారు. వీటి తయారీ పెరిగినప్పటికీ ,పెరుగుతున్న డిమాండ్‌కు సరిపోని పరిస్థితి.
భారత ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వయిజర్ కార్యాలయం , ఇంట్లో తయారుచేసుకునే మాస్క్‌లకు సంబంధించి మాన్యువల్‌ను విడుదల చేసింది. ఇంట్లో లభ్యమయ్యే వస్త్రం ద్వారా సార్స్- సిఒవి-2 కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు మాస్క్‌ల పేరుతో మాన్యువల్ రూపొందించారు. ఇందుకు ఉపయోగించే మెటీరియల్ అందుబాటు ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోగలగడం, వినియోగం, పునర్వినియోగం వంటివి ఇందులో ముఖ్యమైనవి.
తమ వద్దకు వచ్చే కస్టమర్లు ముఖానికి మాస్క్ ధరించాలని షాప్‌లు ఇతర స ర్వీసు కేంద్రాలు కోరుకుంటున్నాయి. కొన్ని చోట్ల మాస్క్‌లు ధరించని కస్టమర్లకు సేవలు అందించడానికి నిరాకరిస్తున్న పరిస్థితి, ఇలాంటి పరిస్థితులలో ఇంట్లో తయారుచేసుకునే మాస్క్‌లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. పబ్లిక్ ప్రదేశాలలో మాస్క్ ను ఉపయోగించడం వల్ల వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఉపకరిస్తుందని పలువురు ఆరోగ్య రంగ నిపుణులు చెబుతున్నారు. ప్రతిపాదిత గైడ్ ఇంట్లోనే మాస్క్‌లు తయారు చేసుకోవడానికి సంబంధించినది. వీటిని ఒకసారి వాడుకున్న తర్వాత మళ్లీ తిరిగి వాడుకోవచ్చు. ఈ మాన్యుయల్ ఎన్..జి.ఒలకు, స్వంతంగా ఇలాంటి మాస్క్‌లను ఇంట్లోనే తయారు చేసుకునే వారికి ఉపయోగపడుతుంది. తద్వారా దేశవ్యాప్తంగా మాస్క్‌లు వాడకానికి అందుబాటులోకి వస్తాయి.
గాలిలోని తుంపర్ల ద్వారాకరోనా వైరస్ మన శ్వాసకోశ వ్యవస్థ లోకి ప్రవేశించే అవకాశాన్ని రక్షిత మాస్క్‌లు తగ్గిస్తాయి. పబ్ మెడ్ అనాలసిస్ లో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, 50 శాతం జనాభా మాస్క్‌లు ధరిస్తే ఇక మిగిలిన 50 శాతం మందికి మాత్రమే వైరస్ సోకే అవకాశం ఉంటుంది. 80 శాతం జనాభా మాస్క్‌లు ధరిస్తే ఆ మేరకు వైరస్ వ్యాప్తి ప్రమాధం గణనీయంగా తగ్గుతుంది. జనసాంద్రత ఎక్కువగా ఉ న్న ప్రాంతాలలో మాస్క్‌లు ధరించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
భారతదేశంలో పలు ప్రాంతాలలో జన సాంద్రత ఎక్కువ. ఢిల్లీలోని ఈశాన్య జిల్లాలో జనసాంద్రత చదరపు కిలోమీటరుకు 36,155 మంది. అందువల్ల నమూనాలు, నియంత్రణ పాయింట్లు ఇవి ప్రమాణాలకు అందనివి. మాస్క్‌లు, చేతులు శుభ్రం చేసుకోవడం వంటికి ఇంట్లోనే చేసుకోవచ్చు నని డాక్టర్ గుప్తా ఇండియా సైన్స్ వైర్ తో అన్నారు.
సైన్స్ అండ్ టెక్నాలజీ సాధికారత కమిటీని 2020 మార్చి 19న ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి ప్రొఫెసర్ వినోద్ పాల్ , నీతి ఆయోగ్ సభ్యుడు, ప్రొఫెసర్ కె.విజయరాఘవన్, ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వయిజర్, భారత ప్రభుత్వం సంయుక్తంగా నాయకత్వం వహిస్తున్నారు. సైన్స్ ఏజెన్సీలు, సైంటిస్టులు, పరిశ్రమలు, రెగ్యులేటరీ సంస్థలతో సమన్వయం చేసుకునేందుకు , తక్షణం తగిన చర్యలు తీసుకునేందుకు ఈ కమిటీ పనిచేస్తుంది. అలాగే సార్స్ -కోవ్-2, కోవిడ్ -19 మహమ్మారికి సంబంధించి పరిశోధన, అభివృద్ధి , ఇతర అమలు అంశాలకు సంబంధించి ఈ సాధికారత కమిటీ పనిచేస్తుంది.
ఇంటివద్దే ముఖానికి వాడే మాస్క్‌లు తయారు చేసుకోవడానికి సంబంధించిన మాన్యుయల్‌ను కింది లింక్‌ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
http://bit.ly/DIYMasksCorona
(Release ID: 1610206)
Visitor Counter : 221