వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ కారణంగా పెట్రోలియం, ప్రేలుడు పదార్ధాలు, ఆక్సిజన్, పారిశ్రామిక గ్యాస్ పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పెట్రోలియం మరియు ప్రేలుడు పదార్ధాల భద్రతా సంస్థ (పి.ఈ.ఎస్.ఓ.) వివిధ చర్యలు చేపట్టింది. 

Posted On: 28 MAR 2020 2:35PM by PIB Hyderabad
  1. వైద్య పరమైన ఆక్సిజెన్ నిల్వ చేయడానికీ, రవాణా చేయడానికీ వెంటనే అనుమతి మంజూరు లభించేలా పి.ఈ.ఎస్.ఓ. కు చెందిన అన్ని సర్కిల్ మరియు సబ్ సర్కిల్ కార్యాలయాలకు సూచనలు జారీ చేయడం జరిగింది.

 

  1. దేశంలో కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి తీసుకోవలసిన చర్యలపై హోంమంత్రిత్వశాఖ జారీ చేసిన ఆదేశాలు నెంబరు: 40-3/2020 తేదీ: 24/03/2020 కి అనుగుణంగా వైద్య పరమైన ఆక్సిజన్ మరియు నైట్రోజన్ ఆక్సైడ్ తయారీ, రవాణాలను నిరంతరాయంగా అనుమతించవలసిందిగా కోరుతూ - అన్ని రాష్ట్రాలకు చెందిన హోంశాఖ ప్రధాన కార్యదర్శులకు 25.03.2020 తేదీన సూచనలు జారీ చేయడమైనది.

 

  1. ఆక్సిజన్ మరియు ఇతర గ్యాస్ ల రవాణాకోసం 31/03/2020 తేదీన ముగిసే లైసెన్స్ గడువును 30/06/2020 తేదీ వరకు పొడిగించడమైనది.

 

  1. ప్రేలుడు పదార్ధాలు బాణాసంచా తయారీ, నిల్వ, రవాణా, అమ్మకం, వినియోగం కోసం 31/03/2020 తేదీన ముగిసే లైసెన్స్ గడువును కూడా 30/06/2020 తేదీ వరకు పొడిగించడమైనది. లైసెన్సులను ఆలస్యంగా పునరుద్ధరించుకోడానికి ఎటువంటి అపరాధ రుసుము చెల్లించవలసిన అవసరం లేదు.

 

  1. కంప్రెస్డ్ ఆక్సిజన్, సి.ఎన్.జి., ఎల్.పి.జి., మరియు ఇతర గ్యాస్ ల నిల్వ కోసం ఉపయోగించే సిలిండర్లకు చట్ట బద్ధమైన హైడ్రో పరీక్ష నిర్వహించడానికి గడువు తేదీ 31/03/2020 కాగా, ఆ గడువు తేదీని 30/06/2020 గా పరిగణిస్తారు.

 

  1. ఆక్సిజన్, ఎల్.పి.జి., మరియు ఇతర గ్యాస్ ల నిల్వ, రవాణా కోసం ఉపయోగించే ప్రెషర్ వెస్సెల్స్ యొక్క సేఫ్టీ రిలీఫ్ వాల్వ్ ల చట్ట బద్దమైన పరీక్షలకు 15/03/2020 తేదీ నుండి 30/06/2020 మధ్య కాలంలో ఉన్న గడువు తేదీలను 30/06/2020 తేదీన గడువుగా పరిగణిస్తారు.

 

 

*****



(Release ID: 1608801) Visitor Counter : 90


Read this release in: English