ఆర్థిక మంత్రిత్వ శాఖ
‘‘జిల్లా జిల్లాలో కేంద్ర జిఎస్‌టి మీకోసం’’
Posted On:
24 FEB 2020 7:02PM by PIB Hyderabad
పన్ను చెల్లింపుదారులు, జిఎస్‌టి వృత్తి నిపుణులకు జిఎస్‌టి సమస్యలు, సందేహాల నివృత్తి మరియు జిఎస్‌టి చట్టంపై సెంట్రల్ జిఎస్‌టి, హైదరాబాద్ అధికారుల బృందం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
రేపు అంటే 2020 ఫిబ్రవరి 25వ తేదీన ఉదయం 10.00 గంటలకు నుండి సాయంత్రం 6.00 గంటలకు గోటేటి కళ్యాణ మండపం, స్వాగత్ గ్రాండ్ దగ్గర, రాక్ టౌన్ రెసిడెన్స్ కాలనీ, సాయి నగర్, ఎల్.బి. నగర్ నందు ‘‘జిల్లా జిల్లాలో కేంద్ర జిఎస్‌టి మీకోసం’’ - జిఎస్‌టి అవగాహన కార్యక్రమం నిర్వహించబడుతోందని, పన్ను చెల్లింపుదారులు, జిఎస్‌టి నిపుణులు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సెంట్రల్ జిఎస్‌టి, హైదరాబాద్, డిప్యూటీ కమిషనర్ (జిఎస్‌టి) శ్రీ వి. శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు.
మరిన్ని వివరాలకు సూపరింటెండెంట్ (జిఎస్ టి) శ్రీ సి.వి. రమణ శర్మ, ఫోన్ నెంబర్: 9849604835 ను సంప్రదించవలెను.
(Release ID: 1604229)
Visitor Counter : 178