పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
చమురు మరియు సహజవాయువు రంగం లో సహకారాని కి బ్రెజిల్ కు మరియు భారతదేశాని కి మధ్య ఉద్దేశించిన ఎంఒయు కు ఆమోదం తెలిపిన మంత్రిమండలి
నాడు పోస్టు చేయడమైనది:
22 JAN 2020 3:37PM by PIB Hyderabad
ఫెడరేటివ్ రిపబ్లిక్ ఆఫ్ బ్రెజిల్ కు మరియు రిపబ్లిక్ ఆఫ్ ఇండియా కు మధ్య చమురు మరియు సహజవాయువు రంగం లో సహకారాని కి ఉద్దేశించిన ఒక అవగాహన పూర్వక ఒప్పంద పత్రం (ఎంఒయు)పై సంతకాలు చేయడాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.
ఈ ఎంఒయు చమురు మరియు సహజవాయువు రంగం లో ఇరు పక్షాల కు మధ్య సహకారాన్ని పెంపొందింప చేయనుంది. ఈ ఎంఒయు లో భాగం గా- బ్రెజిల్ లో, భారతదేశం లో ఇ & పి కార్యకలాపాల లో సహకారాన్ని నెలకొల్పుకొనే దిశ గా ఉభయ పక్షాలు కృషి చేస్తాయి; భారతదేశం లో, బ్రెజిల్ లో, తృతీయ దేశాల లో ద్రవీకృత సహజ వాయువు పథకాల అమలు లో సహకారాని కి గల అవకాశాల ను అన్వేషించడం, అంతే కాకుండా శక్తి ఉత్పాదన సామర్థ్యం, శక్తి సంబంధి పరిశోధన, అభివృద్ధి మరియు ప్రాంతీయ శక్తి సంబంధి మౌలిక సదుపాయాల నెట్ వర్క్ ల విస్తరణ లు సహా చమురు సంబంధిత శక్తి, ఇంకా పర్యావరణ పరమైన అంశాల లో సమన్వయాన్ని సైతం ప్రోత్సహించుకొనేందుకు ఉభయ పక్షాలు చొరవలు తీసుకొంటాయి.
బ్రెజిల్ అధ్యక్షుడు భారతదేశాన్ని ఈ నెల లోనే సందర్శించే కాలం లో ఈ ఎంఒయు పై సంతకాలయ్యే అవకాశం ఉంది.
**
(రిలీజ్ ఐడి: 1600280)
సందర్శకుల సూచీ సంఖ్య : : 138