గనుల మంత్రిత్వ శాఖ
గనులలో భద్రత పై సమావేశం
Posted On:
17 JAN 2020 7:18PM by PIB Hyderabad
గనులలో భద్రతకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ (డిజిఎమ్ఎస్) దక్షిణ మధ్య జోన్ కార్యాలయంలో దేశవ్యాప్తంగా ఉన్న ట్రేడ్ యూనియన్లతో ఈ రోజు ఒక సమావేశం జరిగింది. గనుల భద్రతకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అనుసరించవలసిన ప్రణాళిక గురించీ, ఈ సమావేశంలో చర్చించారు.
ఈ కార్యక్రమం లో వివిధ జోన్లకు సంబంధించిన డిప్యూటీ డైరెక్టర్ జనరల్స్ శ్రీ సి. రమేష్ కుమార్, శ్రీ గుబ్బా విజయ్ కుమార్, శ్రీ డి.కె. సాహో, శ్రీ మలయ్ టికడర్, శ్రీ కె.ఎస్. యాదవ్, శ్రీ ప్రభాత్ కుమార్ మరియు సౌత్ సెంట్రల్ జోన్ కు సంబంధించిన ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు.
ఈ సమావేశంలో 92 ట్రేడ్ యూనియన్లకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.
***
(Release ID: 1599739)
Visitor Counter : 97