PIB Headquarters
అహ్మద్ గూడ లో టపా ను తగులబెట్టేదురాగతానికి అడ్డుకట్టతపాలా సంచులను స్వాధీనం చేసుకొన్నపోస్టల్ అధికారులు
నాడు పోస్టు చేయడమైనది:
07 JAN 2020 6:59PM by PIB Hyderabad
గుర్తు తెలియని వ్యక్తి కీసర లోని అహ్మద్ గూడ లో తపాలా కు సంబంధించిన టపా ను కాల్చివేస్తున్న సమాచారాన్ని కీసర పోలీస్ ఠాణా వారు సికిందరాబాద్ డివిజన్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ దృష్టి కి తీసుకుపోయారు. దీనితో, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ ఈస్ట్ సబ్ డివిజన్ తో పాటు సికిందరాబాద్ డివిజన్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ హుటాహుటిన ఆ ప్రదేశానికి వెళ్లి సదరు తపాలా సంచుల ను స్వాధీనం చేసుకొన్నారు. ఆ సంచులను తెరచిచూడగా అందులో బాలానగర్ టౌన్ శిప్ పోస్టాఫీసు 500037 కు చెందిన సాధారణ టపా ఉన్నట్టు గుర్తించారు. వెంటనే ఆ టపా ను వేరు చేసి ఆ ఉత్తరాలను ఆయా చిరునామా లకు బట్వాడా చేసే పని ని చేపట్టినట్లు, ఆ సంచులలో గల ఆధార్ కార్డులను అన్నింటిని రెండు రోజుల లోపల చిరునామాదారుల కు అందించడం జరుగుతుందని సికిందరాబాద్ డివిజన్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ తెలిపారు. ప్రాథమిక దర్యాప్తు లో పైన పేర్కొన్న సంచులను అందజేయకపోవడానికి ఇద్దరు పోస్టల్ క్లర్కులు, ఒక పోస్ట్ మన్, ఒక పోస్ట్ వుమన్ మరియు ఇద్దరు గ్రామీణ డాక్ సేవక్ లు బాధ్యులు అని తేలింది. డిపార్ట్ మెంటల్ దర్యాప్తు ప్రక్రియ కొనసాగుతోందని, దర్యాప్తు క్రమంలో నేరం చేసిన ఇతర అధికారులపైన చర్యలను తీసుకోవడం జరుగుతుందని స్పష్టంచేశారు. జరిగిన లోటుపాటులకు తపాలా విభాగం క్షమాపణలు వ్యక్తం చేసింది. ప్రజలకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొంది. అటువంటి ఘటనలు ఇక ముందు జరుగకుండా శ్రద్ధ వహించగలమని తపాలా విభాగం స్పష్టం చేసింది.
**
(రిలీజ్ ఐడి: 1598666)
సందర్శకుల సూచీ సంఖ్య : : 56