PIB Backgrounder

సిఎఎ, ఎన్‌ఆర్‌సి ముస్లింలకు వ్యతిరేకం కాదు, మైనారిటీల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది: రాందాస్‌ అథవాలే

తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల పనితీరుపై సమీక్షా సమావేశం నిర్వహించిన కేంద్ర సాంఘిక న్యాయ శాఖ సాధికారత సహాయ మంత్రి రాందాస్‌ అథవాలే

నాడు పోస్టు చేయడమైనది: 06 JAN 2020 7:07PM by PIB Hyderabad

పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సి) భారత ముస్లింలకు వ్యతిరేకం కాదని ,ముస్లిం సమాజంతో పాటు దేశంలోని ఇతర మైనారిటీల అభివృద్ధికి  కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర సామాజిక న్యాయంసాధికారత శాఖ మంత్రి శ్రీ రామ్‌దాస్ అథవాలే అన్నారు. ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన విలేకరుల సమావేశంలో కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తోన్న సంక్షేమ పథకాల గురించి వివరించారు.  

గడచిన 5 ఏళ్లలో (2014-19) రూ. 2, 918 కోట్లు జాతీయ రహదారుల అభివృద్ధికి జాతీయ రవాణారహదారుల మంత్రిత్వ శాఖ తెలంగాణ రాష్ట్రానికి కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్ర రహదారుల అభివృద్ధికి రూ.1230 కోట్లు కేటాయించినట్లు, పిఎం సడక్ యోజనకు 2457 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. 23 జాతీయ రహదారులు తెలంగాణ రాష్ట్రం గుండా వెళుతున్నాయని మంత్రి తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో 2. 85 లక్షల మంది ఎస్సీ విద్యార్థులకు5.15 లక్షల మంది ఓబీసీ విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. స్కాలర్‌షిప్‌ల కోసం దాదాపు 2100 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.

 

అంతకు ముందు తెలంగాణ రాష్ట్రంలో  అమలవుతున్న సంక్షేమ పథకాల పనితీరుపై, తెలంగాణలోని ఎస్సీ / ఎస్టీఓబిసి విద్యార్థుల ఉపకార వేతనాల అమలుపై  తెలంగాణ రాష్ట్ర సీనియర్ అధికారులతో  కేంద్ర సాంఘిక న్యాయ శాఖ సాధికారత సహాయ మంత్రి రాందాస్‌ అథవాలే సమీక్షా సమావేశం నిర్వహించారు.


(రిలీజ్ ఐడి: 1598574) సందర్శకుల సూచీ సంఖ్య : : 90
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English