PIB Headquarters

నిఘా జాగృతి వారాన్ని పాటించిన ఆంధ్ర ప్ర‌దేశ్, తెలంగాణ ప్రాంత ఆదాయ‌పు ప‌న్ను విభాగం 

Posted On: 31 OCT 2019 5:31PM by PIB Hyderabad

ఆంధ్ర ప్ర‌దేశ్ మ‌రియు తెలంగాణ ప్రాంత ఆదాయ‌పు ప‌న్ను విభాగం ఈ నెల 28వ తేదీ నుండి న‌వంబ‌ర్ 2వ తేదీ వ‌ర‌కు నిఘా జాగృతి వారాన్ని పాటిస్తోందని ఆదాయ‌పు ప‌న్ను విభాగం ప్రిన్సిప‌ల్ చీఫ్ క‌మిశ‌న‌ర్ కార్యాల‌యం తెలిపింది. ఈ సంద‌ర్భం గా ఇన్‌క‌ం ట్యాక్స్ డిపార్ట్ మెంట్ అధికారులు న్యాయ‌వ‌ర్త‌న ప్ర‌తిజ్ఞ ను స్వీక‌రించారు. ‘‘న్యాయ‌వ‌ర్త‌న- ఒక జీవ‌న మార్గం’’ అంశం పై హైద‌రాబాద్ లో ఏర్పాటైన ఒక కార్య‌క్ర‌మం లో ఆదాయ‌పు ప‌న్ను విభాగం అధికారుల ను ఉద్దేశించి పూర్వ సెంట్ర‌ల్ విజిలెన్స్ క‌మిశ‌న‌ర్ శ్రీ కె.వి. చౌద‌రి ప్ర‌సంగించారు. ఈ విభాగం అధికారులు ఎల్ల‌వేళ‌లా నైతిక నిష్ఠ ను అనుస‌రించాల‌ని ఆయ‌న ఉద్భోదించారు. విధుల నిర్వ‌హ‌ణ లో ప్ర‌మాణాల తో కూడిన ప్ర‌క్రియ‌ల ను అనుస‌రించ‌డానికి ప్రాముఖ్యాన్ని ఇవ్వాల‌ని శ్రీ కె.వి. చౌద‌రి సూచించారు. ఈ కార్య‌క్ర‌మం లో ప్రిన్సిప‌ల్ చీఫ్ క‌మిశ‌న‌ర్ ఆఫ్ ఇన్‌క‌ం ట్యాక్స్, ఆంధ్ర ప్ర‌దేశ్ మ‌రియు తెలంగాణ ప్రాంతం శ్రీ ఎన్‌. శంక‌ర‌న్‌, హైద‌రాబాద్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇన్‌క‌ం ట్యాక్స్ (ఐఎన్‌వి) శ్రీ ఆర్‌.కె. పాలివాల్‌, హైద‌రాబాద్ చీఫ్ క‌మిశ‌న‌ర్ ఆఫ్ ఇన్‌క‌ం ట్యాక్స్ శ్రీ అతుల్ ప్ర‌ణ‌య్‌, క‌మిశ‌న‌ర్ ఆఫ్ ఇన్‌క‌ం ట్యాక్స్ (అడ్మినిస్ట్రేష‌న్ మ‌రియు టిపిఎస్‌) శ్రీ పీయూష్ సోన్‌క‌ర్ ల‌తో పాటు ఇత‌ర సీనియ‌ర్ అధికారులు కూడా పాల్గొన్నారు.

 

‘విజిలెన్స్ అవేర్‌ నెస్ వీక్’ లో భాగం గా హైద‌రాబాద్ ఆదాయ‌పు ప‌న్ను విభాగం త‌న అధికారుల కు మ‌రియు సిబ్బంది కి వేరు వేరు పోటీల ను నిర్వ‌హించ‌డమే కాకుండా, హైద‌ర‌బాద్ లోని పాఠ‌శాల‌ల, ఇంకా క‌ళాశాల ల‌ విద్యార్థుల కు వ్యాస ర‌చ‌న లోను, నినాదాల ర‌చ‌న లోను, ఇంకా వ‌క్తృత్వం లోను పోటీల ను నిర్వ‌హించింది.

 

***



(Release ID: 1589803) Visitor Counter : 64


Read this release in: English