హోం మంత్రిత్వ శాఖ

పోలీసు సిబ్బంది సంక్షేమానికి మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉంది -జి .కిషన్ రెడ్డి

సిఆర్‌పిఎఫ్ నిర్వహించిన స్నేహపూర్వ క్రికెట్ మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా కేంద్ర హోం సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి

Posted On: 25 OCT 2019 7:26PM by PIB Hyderabad

సర్దార్ వల్లభ్ భాయి పటేల్ 144వ జయంతి (అక్టోబరు 31)ని పురస్కరించుకొని అమరవీరులను సంస్మరించుకోవడంవారి త్యాగాలను నవయువ తరానికి తెలియజేసేలా పోలీసు అమరవీరుల వారోత్సవాలు నిర్వహిస్తున్నామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ జి‌. కిషన్ రెడ్డి అన్నారు.   ఈ రోజు శివరాంపల్లి లోని విజయ్ ఆనంద్ గ్రౌండ్స్ లో కేంద్ర రిజర్వ్ పోలీసు బలగాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ మ్యాచ్లకు ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి హాజరయ్యారు.

సైనికులు ఎలాంటి వాతావరణంలోనైనా పని చేయగలరు. దేశ సరిహద్దులను కాపాడడంలో,  దేశంలో శాంతి భద్రతలను పరిరక్షించే భాద్యతను సక్రమంగా నిర్వర్తిస్తున్నారని మంత్రి కితాబిచ్చారు. పోలీసులు అహర్నిశలు తమ భాద్యతను నిర్వర్తిస్తున్నారనిశాంతి భద్రతలు కాపాడడంలో వారు చూపిస్తున్న తెగువకు మనమంతా ఋణపడి ఉన్నామన్నారు.  దేశ అంతర్గత భద్రతా నిర్వహణలో మరియు శాంతిభద్రతల పరిరక్షణలో కేంద్ర రిజర్వ్ పోలీసు బలగాలు అందిస్తున సేవలను కొనియాడారు .

జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా అహ్మదాబాద్ లో వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లుప్రధాని శ్రీ  నరేంద్ర మోదీ తో పాటు కేంద్ర హోం శాఖా మంత్రి    శ్రీ అమిత్ షా ఈ  కార్యక్రమం లో పాల్గొంటున్నట్లు మంత్రి తెలిపారు. 

గౌరవ కాన్సుల్ జనరల్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా శ్రీ సురేష్ చుక్కపల్లి, తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పద్మశ్రీ డా. బ్రహ్మానందం, డా రాజశేఖర్ దంపతులు, శివాజీ రాజా, పృథ్వీ, అడవి శేష్, భారత జాతీయ క్రికెట్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన ప్రగ్యాన్ ఓఝా, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ సజ్జనార్, కేంద్ర పోలీస్ బలగాలకు చెందిన అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

****


(Release ID: 1589276) Visitor Counter : 103


Read this release in: English