PIB Headquarters
ఆంధ్ర రాష్ట్రంలో ఇక ఆధార్ సేవలు మరింత సులభం మొదటి ఆధార్ సేవా కేంద్రం లబ్బీపేట, విజయవాడ లో ప్రారంభం
Posted On:
24 OCT 2019 7:05PM by PIB Hyderabad
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ద్వారా నిర్వహించబడుచున్న మొట్టమొదటి ఆధార్ సేవా కేంద్రం లబ్బీపేట, విజయవాడ లో పని చేయుట ప్రారంభించినది (చిరునామా: 39-10-7, మున్సిపల్ వాటర్ ట్యాంక్ ఎదురుగా, లబ్బీపేట, విజయవాడ-520 002). ఈ కేంద్రం లో ప్రతి రోజూ 500 వరకు ఆధార్ నమోదు/ అప్‌డేట్స్ (నవీకరణలు) చేసే సామర్ధ్యం ఉన్నది. ఇక్కడ నమోదు మరియు పేరు, చిరునామా, పుట్టిన తేదీ, జెండర్, మొబైల్ నెంబర్, ఇ-మెయిల్ మొదలగు అప్ డేట్స్ (నవీకరణలు) చేసుకోవచ్చు. అంతేకాకుండా, బయోమెట్రిక్స్ సంబంధిత ఫోటో, వేలి ముద్రలు మరియు కనుపాల అప్‌డేట్స్ (నవీకరణలు) కూడా చేసుకోవచ్చు.
యుఐడిఎఐ సంస్థ తమ వెబ్ సైట్ ask.uidai.gov.in ద్వారా ప్రజలు ఆన్ లైన్ లో అపాయింట్‌మెంట్ తీసుకొనే సౌకర్యం కూడా కల్పించింది. ఈ కేంద్రం ఉదయం 9.30 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు పని చేస్తుంది. మరియు వారంలో 7 రోజులూ తెరచి ఉంచబడుతుంది. తగినంత సీటింగ్ వసతితో పాటు, ఈ కేంద్రం ఎయిర్ కండిషన్ చేయబడిన భవనంలో నిర్వహించబడుతుంది. తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, 5 మరియు 15 సంవత్సరాలు నిండిన పిల్లలకు విధిగా వర్తించే బయోమెట్రిక్స్ నవీకరణ పూర్తిగా ఉచితం. ఇతర అప్‌డేట్స్ (నవీకరణలు) కొరకు ఈ కేంద్రం 50 రూపాయలు రుసుము వసూలు చేస్తుంది.
ఈ కేంద్రంలో విజయవాడ లో నివసించే వారితో పాటు ఏ ప్రాంతం వారైనా కూడా ఆధార్ సేవలు ఉపయోగించుకోవచ్చు.
‘‘‘
(Release ID: 1589135)
Visitor Counter : 345