PIB Headquarters

అంతర్జాతీయ సైన్స్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా సందర్భంగా తార్నాక నుంచి నాగోల్ మెట్రో కారిడార్ వరకు సైన్స్ కారిడార్ ఏర్పాటు

Posted On: 24 OCT 2019 7:04PM by PIB Hyderabad

వచ్చే నెల 5 వ తేదీ నుంచి కోలకత్తా లో జరగనున్న అంతర్జాతీయ సైన్స్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా సందర్భంగా తార్నాక నుంచి నాగోల్ మెట్రో కారిడార్ వరకు సైన్స్ కారిడార్ ను ఏర్పాటు చేస్తున్నట్లు సి.డి.ఎఫ్.డి డైరెక్టర్ దేబశిష్ మిత్రా తెలిపారు.  హైదరాబాద్ లోని డి ఎన్ ఏ  ఫింగర్ ప్రింటింగ్  డయాగ్నస్టిక్స్ కేంద్రం (సి.డి.ఎఫ్.డిఈ రోజు ఓపెన్ హౌస్ ను నిర్వహించింది. ఈ సందర్భంగా సి.డి.ఎఫ్.డి డైరెక్టర్ దేబశిష్ మిత్రా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూసి.డి.ఎఫ్.డి ఈ ఫెస్టివల్ లో పెద్దెత్తున పాలు పంచుకుంటున్నట్లు చెప్పారు.  డి ఎన్ ఏ ఫింగర్ ప్రింటింగ్ లో సి.డి.ఎఫ్.డి  ప్రస్తుతం 'తర్వాతి తరంటెక్నాలజీ ద్వారా మానవ జీనోమ్ విశ్లేషణ చేస్తున్నట్లు చెప్పారు. కొత్త పరిజ్ణానాన్ని ఉపయోగించి జీనోమ్ విశ్లేషణ వల్ల జన్యు సంబంధిత వ్యాధుల విశ్లేషణ వేగంగా జరుగుతోందనిదాని వల్ల వ్యాధుల గుర్తింపు త్వరగాచౌకగా జరుగుతోందని చెప్పారు. ఓపెన హౌస్ సందర్భంగావిద్యా సంస్ధల నుంచి విద్యార్ధులు పెద్ద సంఖ్యలో సి.డి.ఎఫ్.డి లాబొరేటరీలను సందర్శిస్తున్నారని చెప్పారు.

ఈ సందర్భంగా సి.ఎస్.ఐ.ఆర్ మాజీ డైరెక్టర్ జనరల్ ప్రొ సమీర్ బ్రహ్మచారి జీనోమిక్స్ ప్రవేశం తర్వాత వైద్యంబిగ్ డాటాఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్అన్న అంశంపై ప్రత్యేక  ఉపన్యాసం చేశారు.

హైదరాబాద్ లోని సి.ఎస్.ఐ.ఆర్  సంస్ద పలువురు విద్యార్ధులను కోల్ కతా సైన్స్ ఫెస్టివల్ కు పంపుతున్నట్లు తెలిపారు. ఐ.ఐ.సి.టి  ప్రిన్సిపల్ శాస్త్రవేత్త డా. రామానుజ్ నారాయణ్  కూడా ఈ కార్యక్రంమలో పాల్గొన్నారు

 

***  



(Release ID: 1589133) Visitor Counter : 103


Read this release in: English