PIB Headquarters
ఇ ఎస్ ఐ సి ప్రభుత్వ వైద్య విద్యార్థులచే హిప్పోక్రాటిక్ ప్రమాణం చేయించిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డా. తమిళిసై సౌందర రాజన్
Posted On:
11 OCT 2019 6:48PM by PIB Hyderabad
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డా. తమిళిసై సౌందర రాజన్ 2019-20 బ్యాచ్ ఇ ఎస్ ఐ సి వైద్య విద్యార్థులచే ఈ రోజు హిప్పోక్రటిక్ ప్రమాణం చేయించారు. 2019-20 విద్యా సంవత్సరం లో ప్రతిభ కనబరచిన 19 మంది విద్యార్థులకు బంగారు పతకాలు , ధృవీకరణ పత్రాలను గవర్నర్ అందజేశారు.
మెడికల్ కాలేజీని దేశంలో ప్రముఖ కళాశాల గా తీర్చిదిద్దినందుకు కళాశాల వారిని ఆమె అభినందించారు. రోగుల పట్ల శ్రద్ధ వహించాలని, వారితో జాగ్రత్తగా వ్యవహరించాలని వైద్య విద్యార్థులకు ఆమె సలహా ఇచ్చారు. 2016 నుండి ఇ ఎస్ ఐ సి మెడికల్ కాలేజీ ప్రాంగణం ప్లాస్టిక్ రహితంగా ఉండటం పట్ల డా. తమిళిసై సౌందర రాజన్ ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణలో డెంగ్యూ, విష జ్వరాలు వ్యాప్తి చెందడంపై ఆమె వైద్యులను హెచ్చరించారు.
ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ, ఇఎస్ఐసి మెడికల్ కాలేజీని 4 సంవత్సరాల వ్యవధిలో అగ్రశ్రేణి వైద్య సంస్థగా మార్చడంలో డీన్ శ్రీ. శ్రీనివాస్ చేసిన కృషిని ప్రశంసించారు. అబ్బాయిల కంటే అమ్మాయిలు ప్రతిభను కనబరచి నందుకు శ్రీ బండారు దత్తాత్రేయ సంతోషం వ్యక్తం చేశారు. అమ్మాయిలు నిర్భయంగా ఉండాలని వారి వృత్తిలో రాణించమని సలహా ఇచ్చాడు.
అంతకుముందు శ్రీమతి సంధ్య శుక్లా, ఇఎస్ఐసి ఆర్థిక కమిషనర్ స్వాగతోపన్యాసం చేశారు . డాక్టర్ ఎం. శ్రీనివాస్ డీన్, డాక్టర్ మాధురి, రిజిస్ట్రార్, డాక్టర్ సంపత్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ ఇఎస్ఐసి మెడికల్ కాలేజీ తో పాటు ఇతర సిబ్బంది , వైద్య విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(Release ID: 1587865)
Visitor Counter : 216