హోం మంత్రిత్వ శాఖ
70వ బ్యాచ్ ఐపిఎస్ ప్రొబేషనర్స్ దీక్షాంత్ పెరేడ్ గౌరవ వందనం స్వీకరించనున్న కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
Posted On:
22 AUG 2019 6:17PM by PIB Hyderabad
కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా, ఆగస్టు 24, 2019న 70వ బ్యాచ్ ఐపిఎస్ ప్రొబేషనర్ల దీక్షాంత్ పెరేడ్ లో పాల్గొని గౌరవ వందనం స్వీకరిస్తారు. ఈ రోజు సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్, పోలీసు అకాడెమీ డైరెక్టరు శ్రీ అభయ్ పత్రికా విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, ఈ బ్యాచ్ లో 92 మంది ఆఫీసర్లు శిక్షణ పొందారనీ, వీరిలో 12 మంది మహిళలు ఉన్నారనీ అన్నారు. శిక్షణ పొందిన 11 మంది విదేశీ ఆఫీసర్లలో ఆరుగురు రాయల్ భూటాన్ పోలీస్ ఆఫీసర్లు, ఐదుగురు నేపాల్ పోలీస్ ఆఫీసర్లూ ఉన్నారని, ఆయన తెలిపారు. వీరిలో తెలంగాణ కేడర్ కు ముగ్గురు ప్రొబేషనర్లు ఎంపికయ్యారు. తెలంగాణ కేడర్ కు చెందిన శ్రీ గౌష్ ఆలమ్ కు ఉత్తమ ప్రొబేషనరుగా ఎంపికయ్యారని ఆయన తెలిపారు. మహిళలలో ఉత్తమ ప్రొబేషనరుగా రాజస్థాన్ కేడర్ కు చెందిన రిచా తోమర్ ఎంపికయ్యారు. ఉత్తమ ఆల్‌రౌండ్ ప్రొబేషనరుగా ఎంపికైన శ్రీ గౌష్ ఆలమ్ ప్రధాన మంత్రి బేటన్, హోం మంత్రి రివాల్వర్ అందుకొంటారు.
ప్రొబేషనర్లు ఎక్కువ శాతం సామాన్య కుటుంబాలకు చెందినవారనీ, ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటూ వారు ఐపిఎస్ ఆఫీసర్లుగా కఠోర శిక్షణ పూర్తి చేసుకొన్నారనీ, శ్రీ అభయ్ తెలిపారు. శిక్షణ లో 42 వారాల బేసిక్ ట్రైనింగ్, కేడర్ కు చెందిన జిల్లాలలో శిక్షణ తర్వాత అకాడెమీలో 13 వారాల శిక్షణ పొందారని, శ్రీ అభయ్ తెలిపారు.
***
(Release ID: 1582661)
Visitor Counter : 161