PIB Backgrounder

ఎన్.ఐ.ఎస్.ఏ(నిసా) లో జల‌ సంరక్షణపై మాట్లాడిన జల‌ సంరక్షణ ఉద్యమకారుడు సోలార్ సురేష్

प्रविष्टि तिथि: 31 JUL 2019 6:29PM by PIB Hyderabad
Press Release photo

 'సోలార్ ’సురేష్ గా పిలవబడే  ప్రసిద్ధ జల‌ సంరక్షణ ఉద్యమకారుడు శ్రీ సురేష్ హైదరాబాద్ లోని సిఐఎస్ఎఫ్ క్యాంపస్ ను ఈ రోజు సందర్శించారు. జల్ శక్తి అభియాన్ లో భాగ౦గా జాతీయ పారిశ్రామిక భద్రతా అకాడమీ సిబ్బందితో జల‌ సంరక్షణ, హరిత కార్యక్రమాల గురించి ఆయన చర్చి౦చారు.
 

సహజ వనరులను సముచితంగా ఉపయోగించుకోవడం ద్వారా నీటిని పరిరక్షించాల్సిన అవసరం ఉందని, క్యాంపస్‌ను పచ్చగా మార్చాలని ఆయన నిసా సిబ్బందికి సూచించారు.  నీటి సంరక్షణ పద్ధతులను అవలంబించడం ద్వారా 240 ఎకరాల ప్రాంగణం ప్రయోజనం పొందుతుందని ఆయన అన్నారు.

 
శ్రీ సురేష్ ఐఐటి-చెన్నై, ఐఐఎం-అహ్మదాబాద్ కి చె౦దిన‌ పూర్వ విద్యార్థి, చెన్నైలోని తన ఇ౦టిని  సౌర ఫలకాలను, వర్షపు నీటి సేకరణ, బయోగ్యాస్, టెర్రేస్ గార్డెన్స్ మరియు గాలి నుండి తాగునీరు తయారు చేసే ఎయిర్-ఓ-వాటర్ య౦త్రాన్ని ఉపయోగించడం ద్వారా స్వయం సమృద్ధిగా  రూపొందించుకొన్నారు.

 
 


(रिलीज़ आईडी: 1580944) आगंतुक पटल : 84
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English