హోం మంత్రిత్వ శాఖ
హైదరాబాద్ ను సందర్శించిన కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
Posted On:
06 JUL 2019 6:54PM by PIB Hyderabad
కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షా పదవీ బాధ్యతల ను స్వీకరించిన తరువాత మొట్టమొదటి సారి గా శనివారం నాడు హైదరాబాద్ ను సందర్శించారు.
ఆయన కు విమానాశ్రయం లో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్ శ్రీ ఇ.ఎస్.ఎల్. నరసింహన్, కేంద్ర మాజీ మంత్రి శ్రీ బండారు దత్తాత్రేయ, తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) శ్రీ ఎం. మహేందర్ రెడ్డి లతో పాటు కేంద్రీయ పారిశ్రామిక భద్రత దళం (సిఐఎస్ఎఫ్) కు చెందిన పలువురు అధికారులు, రాష్ట్ర పోలీస్ అధికారులు కూడా స్వాగతం పలికారు.
సిఐఎస్ఎఫ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ (ఎయర్ పోర్ట్ సెక్టర్) శ్రీ ఎం.ఎ. గణపతి దేశం లోని విమానాశ్రయాల ను పరిరక్షించడం లో సిఐఎస్ఎఫ్ పోషిస్తున్న పాత్ర ను వివరించే ఒక నివేదిక ను మంత్రి కి సమర్పించారు.
అనంతరం, దేశం లో ప్రప్రథమం గా విమానాశ్రయం లో నెలకొల్పిన ముఖ గుర్తింపు వ్యవస్థ ను గురించి మంత్రి కి సిఐఎస్ఎఫ్ అధికారులు వివరించారు. ఈ వ్యవస్థ ను కొత్త గా సంపాదించుకోవడం జరిగింది. విమానాశ్రయం ప్రాంగణం లో మీ మోమే మీ యొక్క విమాన అధిరోహణ కార్డు గా ఉంటుంది. ఒక వ్యక్తి తన పరిచయ పత్రాలను నమోదు చేసుకొని తన ఫోటో తో కూడిన ఒక చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు ను పొందివుంటే విమానాశ్రయం లోకి త్వరిత గతిన ప్రవేశాన్ని ఈ ముఖ గుర్తింపు వ్యవస్థ సుసాధ్యం చేస్తుంది.
ఈ సందర్భం గా హోం శాఖ సహాయ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి కూడా పాలు పంచుకొన్నారు.
**
(Release ID: 1577647)