PIB Headquarters

భారతీయ జనాభా జన్యు వ్యాధి భారం సమస్యను పరిష్కరి౦చే౦దుకు సి.ఎస్.ఐ.ఆర్- సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సి.సి.ఎమ్.బి), సెంటర్ ఫర్ డిఎన్ఎ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ (సిడిఎఫ్డి) మధ్య అవగాహన ఒప్ప౦ద౦

Posted On: 03 JUL 2019 6:49PM by PIB Hyderabad

ప్రాచీన కాలం నుండి ప్రజలు వ్యాధులతో పోరాడుతున్నారు. జన్యుపరమైన రుగ్మతలు సంక్రమించని వ్యాధుల యొక్క ప్రధాన సమూహంగా ఏర్పడతాయి. నగరాల్లో అప్పుడే జన్మించిన శిశువుల మరణాలకు మూడవ సాధారణ కారణం పుట్టుకతో వచ్చే వైకల్యాలు మరియు జన్యుపరమైన లోపాలు.

భారతదేశంలో జన్యు వ్యాధితో ప్రతి సంవత్సరం 50 లక్షలకు పైగా పిల్లలు పుడుతున్నారని జన్యుపరమైన రుగ్మతల అంచనాలు చెబుతున్నాయి. ఈ రుగ్మతల భారం సమాజంలోని ఆర్థిక మరియు సామాజిక నిర్మాణంపై దాని ప్రభావాలను కలిగి ఉంటుంది. ఈ రుగ్మతలలో చాలావరకు ప్రస్తుతం చికిత్స చేయలేనివి మరియు చికిత్స చేయగల వాటికి  చికిత్స చాలా ఖరీదైనది. ఈ సమస్యను పరిష్కరించడానికి ఏకైక నివారణ విధానం, దీనికి ప్రినేటల్  రోగ నిర్ధారణ మరియు జన్యు సలహా అవసరం.

గత కొన్నేళ్లుగా సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందడంతో జన్యుశాస్త్ర రంగంలో విపరీతమైన మార్పులు చోటుచేసుకున్నాయి. సమర్థవంతమైన, చవకైన డి.ఎన్.ఏ సీక్వెన్సింగ్ టెక్నాలజీ యొక్క ఆగమనం మానవ వ్యాధిపై మన అవగాహనను మెరుగుపరచడంలో ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది, రోగ నిర్ధారణ, చికిత్సకు అవసరమైన‌ మార్గాలను అనుమతిస్తుంది. సి.సి.ఎమ్,బి, సి.డి.ఎఫ్.డి అత్యాధునిక జీవ పరిశోధనలో పాల్గొన్న ప్రధాన జాతీయ సంస్థలు. రెండు దశాబ్దాలకు పైగా ఈ స౦స్థ‌లు జన్యు విశ్లేషణ సేవలను కూడా అందిస్తున్నాయి.

సిసిఎంబి డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ కె మిశ్రా, సిడిఎఫ్డి డైరెక్టర్ డాక్టర్ దేబాషిస్ మిత్రా మానవ వ్యాధి నిర్ధారణలో రెండు సంస్థల సామర్థ్యాన్ని పెంచడానికి ఒక అవగాహన ఒప్పందం కుదుర్ఛుకోవాలని నిర్ణయించారు.  ప్రజలకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన డి.ఎన్.ఏ ఆధారిత రోగనిర్ధారణ సేవలను అందించడం, కొత్త రోగనిర్ధారణ పద్ధతులను అభివృద్ధి చేయడం మరియు మానవ జన్యుపరమైన రుగ్మతలను అర్థం చేసుకోవడానికి శాస్త్రీయ పరిశోధనలో పాల్గొనడం ఈ అవగాహన ఒప్పందం యొక్క లక్ష్యాలు. జన్యు విశ్లేషణ రంగంలో శిక్షణ మరియు విద్యా కార్యకలాపాలను చేపట్టడానికి  ఈ సంస్థలు పరస్పరం అంగీకరించాయి.
 



(Release ID: 1576964) Visitor Counter : 290


Read this release in: English