మంత్రిమండలి

సైబ‌ర్ సెక్యూరిటీ రంగంలో ఇండియా, ఫిన్లాండ్ దేశాల మ‌ధ్య‌న కుదిరిన అవ‌గాహ‌న ఒప్పంద ప‌త్రానికి కేబినెట్ ఆమోదం.

Posted On: 12 JUN 2019 8:13PM by PIB Hyderabad

ఇండియా, ఫిన్లాండ్ దేశాల మ‌ధ్య‌న సైబ‌ర్ సెక్యూరిటీ రంగంలో కుదిరిన అవ‌గాహ‌న ఒప్పంద ప‌త్రానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.  ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆధ్వ‌ర్యంలో స‌మావేశ‌మైన కేబినెట్ ఈ ఆమోదం తెలిపింది. 

ఇండియా, ఫిన్లాండ్ దేశాల మ‌ధ్య‌న ఈ రంగంలో బ‌ల‌మైన స‌హ‌కారానికి ఈ ఎంఓయు ద్వారా సాధ్య‌మ‌వుతుంది. భ‌ద్ర‌తాప‌ర‌మైన స‌మ‌స్య‌ల‌ను గుర్తించ‌డానికి, వాటిపై ఒక నిర్ణ‌యం తీసుకోవ‌డానికి, వాటిని నియంత్రించ‌డానికి  ఇరుదేశాలు సాధించిన అనుభ‌వాల‌ను, విజ్ఞానాన్నిఇరుదేశాలు పంచుకోవ‌డం జ‌రుగుతుంది. 

ఈ ఎంఒయు పై  2019 జ‌న‌వ‌రిలో ఇరుదేశాలు సంత‌కాలు చేశాయి.

***



(Release ID: 1574510) Visitor Counter : 75