PIB Headquarters

ఈజిప్టు ను సందర్శించనున్న హైదరాబాద్ వ్యవసాయ రంగ శాస్త్రవేత్త డాక్టర్ శేక్ ఎన్. మీరా

రైతుల ఆదాయాన్ని పెంపొందించే డిజిటల్ వ్యూహ రూపకల్పన లో ఆయన తన వంతు పాత్ర ను పోషించనున్నారు

Posted On: 13 JUN 2019 7:02PM by PIB Hyderabad

రైతుల జీవ‌నోపాధి ని మెరుగుప‌ర‌చ‌డం ధ్యేయం గా ప‌ని చేస్తున్న ఐక్య రాజ్య స‌మితి (ఐ.రా.స.) కి చెందిన ప్ర‌త్యేక సంస్థ ఇంట‌ర్‌నేష‌నల్ ఫండ్ ఫ‌ర్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ డెవల‌ప్‌ మెంట్ కు క‌న్స‌ల్‌టెంట్ గా హైద‌రాబాద్ కు చెందిన శాస్త్రవేత్త డాక్ట‌ర్ శేక్ ఎన్. మీరా ఎంపిక‌య్యారు.  డాక్ట‌ర్ శేక్ ఎన్. మీరా ఐసిఎఆర్- ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రైస్ రిసర్చ్ లో ప్రిన్సిప‌ల్ సైంటిస్ట్.  మ‌రింత మెరుగైన మార్కెటింగ్ సంబంధాలుస్థిర‌త్వం తో కూడిన వ్య‌వ‌సాయ ఉధృతీక‌ర‌ణ ల‌ ద్వారా వేలాది చిన్న రైతుల‌కు వారి ఆదాయాన్ని పెంపొందింపచేసుకొనేందుకు అధునాతన వ్యూహాల‌పై సలహాలు ఇవ్వడం కోసం డాక్ట‌ర్ శేక్ ఎన్. మీరా ఈజిప్టు ను సంద‌ర్శించ‌నున్నారు.  వ్య‌వ‌సాయ రంగం లో డిజిట‌ల్ ఎక్స్‌ టెన్ష‌న్ స్పెష‌లిస్టు గా ప్ర‌పంచ‌ ప్ర‌ఖ్యాతిని పొందిన గా డాక్ట‌ర్ శేక్ మీరా ఈజిప్టు కు చెందిన వ్య‌వ‌సాయ సంస్థ‌లు అధునాతన డిజిట‌ల్ వ్యూహాల అమలు తో డిజిట‌ల్ ల‌ర్నింగ్ ఆర్గ‌నైజేషన్ లుగా పరివర్తన చెందేందుకు సూచనలు చేయనున్నారు.  తన ఈజిప్టు యాత్ర లో డాక్టర్ శేక్ మీరా చిన్న కమతాలను కలిగివున్న రైతులకు ప్రయోజనాలు చేకూర్చడం కోసం డ్రోన్ లనుఅగ్రిగేషన్ మోడల్స్ నుమొబైల్ కంప్యూటింగ్ నుబిగ్ డేటా ను మరియు ప్రెడిక్టివ్ అనలిటిక్స్ నుఅమెజానైజేషన్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రాడక్ట్ స్యూనీక్ ఐడి ( ఆధార్ )ఆధారితమైన సేవలను ఉపయోగించుకొంటూ ఒక ఏకీకృత‌ వ్యూహానికి రూపకల్పన చేయనున్నారు.



డిజిట‌ల్ అగ్రిక‌ల్చ‌ర్ ప్రాజెక్టుల‌ ను నిర్వ‌హించ‌డం లో డాక్ట‌ర్ మీరా కు 16 సంవ‌త్స‌రాల‌కు పైగా అనుభ‌వం ఉంది.  ఇంత‌వ‌ర‌కు ఆయ‌న 3,500 కు పైగా ప్రాజెక్టుల‌ను విశ్లేషించారు.  2012-13 లో  ఫిలిప్పీన్స్ లోని అంత‌ర్జాతీయ వ‌రి ప‌రిశోధ‌న సంస్థ కు ఆయ‌న ఒక సందర్శక ప‌రిశోధ‌కుడి గా వెళ్లారు.  అక్క‌డి రైస్ నాలెడ్జ్ బ్యాంక్ఇంకా రైస్ డాక్టర్ అనే రెండు డిజిటల్ టూల్స్ ను అప్‌గ్రేడ్ చేయ‌డం లో డాక్ట‌ర్ మీరా త‌న తోడ్పాటును అందించారు.  ఆయ్ వా స్టేట్ యూనివ‌ర్సిటీ కి విజిటింగ్ ఫెలో గా ఉంటూరైతుల‌ కు విప‌ణుల‌తో మ‌రియు సాంకేతిక ప‌రిజ్ఞానం తోను సంధానాన్ని క‌ల్పించే జ్ఞాన నిర్వ‌హ‌ణ వ్యూహాల రూప‌క‌ల్ప‌న లో కీల‌క పాత్ర ను పోషించారు.  ఆయ‌న అందుకొన్న పుర‌స్కారాల లో భార‌త వ్య‌వ‌సాయ రంగానికి గ‌ణ‌నీయ‌మైన సేవ‌ల‌ ను అందించినందుకు గానుఐసిఎఆర్ నుండి ల‌భించిన లాల్ బ‌హాదుర్ శాస్త్రి యువ శాస్త్రవేత్త పుర‌స్కారం చెప్పుకోద‌గ్గ‌ది.  ఇంత‌వ‌ర‌కు ఆయ‌న త‌న సృజ‌నాత్మ‌క‌మైన ఆలోచ‌న‌ల కు గాను రెండు స్వ‌ర్ణ ప‌త‌కాల‌ను, 12 జాతీయ‌అంత‌ర్జాతీయ పుర‌స్కారాల ను అందుకొన్నారు.

 

        
తెలంగాణ‌ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రాల ప్ర‌భుత్వాలు త‌న‌ను సంప్ర‌దించిన ప‌క్షం లో స‌హ‌క‌రించ‌డం కోసం తాను సిద్ధంగా ఉన్నాన‌ని డాక్ట‌ర్ మీరా అన్నారు. 

 

***


(Release ID: 1574499)
Read this release in: English