PIB Headquarters
విద్య, పరిశోధన కార్యక్రమాల లో పిహెచ్. డి. ప్రదానం కోసం ఎంఒయు కుదుర్చుకున్న జిఎస్ఐటిఐ, గౌహతి విశ్వవిద్యాలయం
Posted On:
07 MAY 2019 6:11PM by PIB Hyderabad
విద్య, పరిశోధన రంగాలకు సంబంధించి భారత భూవైజ్ఞానిక సర్వేక్షణ శిక్షణ సంస్థ (జిఎస్ఐటిఐ), గువాహాటీ లోని గౌహతి విశ్వవిద్యాలయం (జియు) లు మంగళవారం ఒక అవగాహన ఒప్పందాన్ని (ఎంఒయు) ను కుదుర్చుకున్నాయి. పిహెచ్. డి. డిగ్రీ కి బాట వేసే విద్యా సంబంధమైన కార్యక్రమాలు, పరిశోధన సంబంధమైన కార్యక్రమాల లో సహకరించుకోవడం కోసం ఈ ఎంఒయు ను కుదుర్చుకున్నాయి. ఈ అవగాహన పూర్వక ఒప్పంద పత్రం పై గౌహతి విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ మృదుల్ హజారికా సమక్షంలో జిఎస్ఐటిఐ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ & ఎం-వి అధిపతి శ్రీ సిహెచ్. వెంకటేశ్వర రావు, జియు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నానీ గోపాల్ మహంతా లు గువాహాటీ లోని గౌహతి విశ్వవిద్యాలయం లో మంగళవారం నాడు సంతకాలు చేశారు. జిఎస్ఐటిఐ బృందం లో జిఎస్ఐటిఐ, టిసి డైరెక్టర్ డాక్టర్ తారక్ నాథ్ పాల్, జిఎస్ఐ అసమ్- ఎస్ యు డైరెక్టర్ శ్రీ సోమనాథ్ శర్మ లు ఉండగా, గౌహతి విశ్వవిద్యాలయ బృందం లో ఇంటర్నల్ క్వాలిటీ అష్యూరెన్స్ సెల్ ( ఐఎక్యుసి) సమన్వయకర్త ప్రొఫెసర్ ఉత్పల్ శర్మ, ఫాకల్టి ఆఫ్ సైన్స్ డీన్ ప్రొఫెసర్ దిలీప్ కాకతి, భూ వైజ్ఞానిక విజ్ఞాన శాస్త్రాధిపతి ప్రొఫెసర్ పరాగ్ ఫూకన్,ఫాకల్టి ఆఫ్ ఆర్ట్స్ డీన్ ప్రొఫెసర్ సౌరవ్ ప్రాణ్ గోస్వామి లతో పాటు ఇతర ఫాకల్టి సభ్యులు ఉన్నారు.
జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జిఎస్ఐ) 1851వ సంవత్సరం లో ఏర్పాటైన పృథ్వీ విజ్ఞాన శాస్త్ర సంస్థ. కాగా వృత్తినైపుణ్యం కలిగిన జిఎస్ఐటిఐ ప్రధాన కార్యాలయం హైదరాబాద్ లో ఉంది. గౌహతి విశ్వవిద్యాలయం గువాహాటీ కేంద్రం గా పని చేస్తున్న విద్యా సంస్థ గా ప్రసిద్ధిపొందింది. గౌహతి విశ్వవిద్యాలయం డిగ్రీల ను ప్రదానం చేస్తున్న సంస్థ కావడం, ఉత్తమమైన అధ్యాపకులు ఉన్న కారణం గా ఈ అవగాహన ఒప్పందం ఇటు జిఎస్ఐ కి, అటు గౌహతి విశ్వవిద్యాలయానికి లాభదాయకం గా ఉండబోతోంది. ఉమ్మడి ఆసక్తుల ను కలిగి ఉన్న రంగాల లో జిఎస్ఐ, గౌహతి విశ్వవిద్యాలయం లు రెండూ కూడా తమ అధ్యాపకుల మరియు శాస్త్రవేత్తల సేవలను పరస్పరం వినియోగించుకొనేందుకు ఈ ఎంఒయు మార్గాన్ని సుగమం చేయనుంది. అంతే కాదు, ఉమ్మడి ఆసక్తులను కలిగి ఉన్న రంగాల లో పరిశోధన పరంగా సమన్వయాన్ని నెలకొల్పుకొనేందుకు కూడా ఇరు సంస్థలకు ఈ ఒప్పందం తోడ్పడనుంది. జిఎస్ఐ అధికారుల కు పిహెచ్ డి డిగ్రీ లను ప్రదానం చేయడం జరుగుతుంది.
మరోపక్క భారతదేశంలోని ఈశాన్య ప్రాంతాలలో పరిశోధన అభివృద్ధి (ఆర్ & డి) కార్యకలాపాలను కూడా జిఎస్ఐటిఐ, గౌహతి విశ్వవిద్యాలయాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం పెంపొందింపచేయనుంది.
***
(Release ID: 1572199)
Visitor Counter : 105