జౌళి మంత్రిత్వ శాఖ

జౌళి రంగాని కి మ‌ద్ద‌తు ఇచ్చేందుకు గాను స్కీమ్ టు రిబేట్ స్టేట్ అండ్ సెంట్ర‌ల్ ఎంబెడెడ్ టాక్సెస్ కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

Posted On: 07 MAR 2019 2:41PM by PIB Hyderabad

జౌళి రంగాని కి మ‌ద్ద‌తు ను ఇచ్చేందుకు గాను స్కీమ్ టు రిబేట్ స్టేట్ అండ్ సెంట్ర‌ల్ ఎంబెడెడ్ టాక్సెస్ కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్యక్ష‌త న‌ జ‌రిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ఆమోదం తెలిపింది.  ఇది దుస్తుల మ‌రియు మేడ్-అప్ ల ఎగుమ‌తి ని సున్నా రేటు కు తెచ్చే విధం గా వివిధ చ‌ర్య ల‌ను చేప‌ట్టేందుకు ప్ర‌భుత్వాని కి మార్గాన్ని సుగ‌మం చేయ‌నుంది.

వివరాలు:

ప్ర‌స్తుతం దుస్తులు మ‌రియు మేడ్-అప్ విభాగాలు స్కీమ్ ఫ‌ర్ రిబేట్ ఆఫ్ స్టేట్ లెవీస్ (ఆర్ఒఎస్ఎల్‌) లో భాగం గా మ‌ద్ద‌తు ను పొందుతున్నాయి.  అయితే, కొన్ని రాష్ట్రాలు మ‌రియు కేంద్ర ప‌న్నులు ఇప్ప‌టికీ ఎగుమ‌తి వ్య‌యాల లో క‌ల‌సివుంటున్నాయి.  భార‌త‌దేశ వ‌స్త్ర ఎగుమ‌తి గంప లో దాదాపు 56 శాతం ఉమ్మ‌డి వాటా ను క‌లిగివున్న దుస్తులు మ‌రియు మేడ్‌-అప్ ల‌కు సంబంధించి అన్ని ఎంబెడెడ్ స్టేట్ అండ్ సెంట్ర‌ల్ టాక్సెస్‌/ లెవీస్ ను త‌గ్గించేందుకు ఒక ప‌థ‌కాన్ని అమ‌లు చేయాల‌ని మంత్రివ‌ర్గం నిర్ణ‌యించింది.  ఐటి చోదక స్క్రిప్ట్ సిస్ట‌మ్ ద్వారా నోటిఫై చేసిన రేట్ల తో ప‌న్నులు మ‌రియు సుంకాల లో త‌గ్గింపు ను అనుమ‌తించ‌డం జ‌రుగుతుంది.

ప్ర‌యోజ‌నాలు:

ప్ర‌తిపాదిత చ‌ర్య‌లు జౌళి రంగాన్ని స్ప‌ర్ధాత్మ‌కం గా తీర్చిదిద్దుతాయ‌ని ఆశించడమైంది.  దుస్తులు, ఇంకా మేడ్‌-అప్ విభాగాల కు రిబేట్ ఆఫ్ ఎంబెడెడ్ స్టేట్ అండ్ సెంట్ర‌ల్ టాక్సెస్ / లెవీస్ ను వ‌ర్తింప చేయ‌డం వ‌ల్ల సున్నా రేటు తో కూడిన ఎగుమ‌తు ల‌కు ఆస్కారం ఏర్ప‌డుతుంది.  త‌ద్వారా ఎగుమ‌తి విప‌ణుల లో భార‌త‌దేశం యొక్క స్పర్ధాత్మకత పుంజుకొంటుంది.  అంతేకాకుండా జౌళి, ఇంకా దుస్తుల రంగం లో స‌మాన‌త్వం తో కూడిన వృద్ధి కి మ‌రియు స‌మ్మిళిత‌మైన వృద్ధి కి వీలు చిక్కుతుంది.


** 



(Release ID: 1568180) Visitor Counter : 110


Read this release in: English , Urdu , Tamil , Kannada