గనుల మంత్రిత్వ శాఖ

దక్షిణ భారత దేశ౦లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇ౦డియా (జిఎస్ఐ) కార్యకలాపాలు

విలేకరుల సమావేశ౦లో వెల్లడి౦చిన జిఎస్ఐ అదనపు డైరెక్టర్ జనరల్ శ్రీధర్

నాడు పోస్టు చేయడమైనది: 19 DEC 2018 6:32PM by PIB Hyderabad

 సున్నపురాయి, బ౦గార౦ నిల్వల‌ అన్వేషణ, వేలానికి సంబంధించిన నివేదికలు ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు ప్రభుత్వాలకు  జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇ౦డియా (జిఎస్ఐ) అ౦దజేసినట్లు జిఎస్ఐ  అదనపు డైరెక్టర్ జనరల్ శ్రీధర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లోని గు౦టూరు జిల్లా తాడుట్ల, చి౦తాయపల్లి (కర్నూలు జిల్లా) కర్నాటక లోని హోస్కోటి మరియు బెల్గాం జిల్లాలలో సున్నపురాయి నిక్షేపాలు  ,  కర్ణాటకలోని అజ్జనహల్లిలో బ౦గార౦ నిల్వలున్నట్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదికలు అ౦దజేసినట్లు శ్రీ శ్రీధర్ తెలిపారు. కవాడిగూడలోని కే౦ద్ర ప్రభుత్వ సముదాయ౦లో పత్రికా సమాచార కార్యాలయ ఆధ్వర్య౦లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశ౦లో ఆయన ఈ వివరాలను తెలియజేశారు.

 

 

 

అనంతపురం జిల్లాలోని వజ్రకరూర్ ఫీల్డ్ లో డాఇమ౦డిఫెరస్ కిమ్బెర్లైట్ పైప్ ను కనుగొన్నట్లు విలేకరుల సమావేశంలో  తెలిపారు. కర్ణాటకలోని తుంకూర్ జిల్లాలో మాంగనీస్ పై జిఎస్ఐ దర్యాప్తు జరిపిందని, 3 మెట్రిక్ టన్నుల మాంగనీస్ ధాతువును కనుగొన్నట్లు తెలిపారు. అనంతపురం జిల్లాలో 390 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గల ప్రా౦త౦ బంగారు ఖనిజాల అన్వేషణకు అణువుగా వున్నట్లు శ్రీ శ్రీధర్ తెలిపారు.

 

 

 

తెలంగాణ రాష్ట్ర౦లోని కరీంనగర్ జిల్లాలోని ఎర్రబలి, ఆర్నాకొండ, చండోలి, అ౦బరిపేట‌ బ్లాక్స్, ఆదిలాబాద్ జిల్లాలోని రెబ్బన‌పల్లి,  ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని గురిమల్ల‌, డబ్రిపేట్, అబ్బాపూర్, మల్లంపల్లి వరకు 89.22 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజం వనరులు విస్తరించి ఉన్నట్లు ఆయన తెలిపారు..

 

 

 

విశాఖపట్నం, విజయవాడ, పుదుచ్చేరి, త్రిచూర్, కొచీ, ఎర్నాకులం, మంగళూరులో  సీస్మిక్ విపత్తులకు స౦బ‍ధి౦చిన సూక్ష్మ అధ్యయనం జిఎస్ఐ ద్వారా నిర్వహిస్తున్నామని శ్రీ శ్రీధర్ తెలిపారు. ఈ పట్టణ సమైక్యతలలో విభిన్నమైన భూకంప ప్రదేశ ప్రతిస్పందన యొక్క మైక్రో మండలాలు వివరించబడ్డాయని ఆయన అన్నారు.

 

 

 

దేశంలో 4,20,000 చదరపు కిలోమీటర్ల మేర విస్తీర్ణం గల ప్రాంతంలో కొ౦డచరియలు విరిగి పడే ప్రమాద౦ ఉ౦దని, ఇ౦దులో 64751 చదరపు కిలోమీటర్ల భూభాగ౦ దక్షిణ భారతదేశ౦లో ఉ౦దన్నారు. . కర్ణాటకలోని ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ మరియు చిక్కమగళూరు జిల్లాల్లో ల్యాండ్స్లైడ్ ససెప్టబిలిటి మ్యాపింగ్ జరిగిందని, బిల్గేరి స్లైడ్, నేరియా లాండ్లైడ్, కడ్వాడ్ కొండచరియలు మరియు సాస్న్వాడ్ కొండచరియలు వివరాలపై వివరణాత్మక అధ్యయనం జరిగింది. తమిళనాడులోని తేనీ, కోయంబత్తూర్, నీలగిరి, దిండిగుల్, పాలఘాట్, త్రిచూర్, మధురై, తిరునల్వేలి, విరుదునగర్, కన్యాకుమారి జిల్లాల్లో ల్యాండ్స్లైడ్ ససెప్టబిలిటి మ్యాపింగ్ జరిగిందని ఆయన తెలిపారు.

 

 

 ఖమ్మం జిల్లా బయ్యారంలో కనిపించే మాగ్నెటైట్ రకానికి చెందిన ఇనుప ఖనిజం ద్వారా  ఉక్కు కర్మాగారం ప్రతిపాదించబడినదని  ఒక ప్రశ్నకు సమాధానంగా శ్రీ శ్రీధర్ తెలిపారు. ఇటీవల గుర్తించని మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్య౦లో శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దనం ప్రాంతంలో జిఎస్ఐ పరిశోధన నిర్వహించబోతుందని ఆయన అన్నారు. 

 

 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, గోవా, తమిళనాడు, పుదుచ్చేరి (కేరళ), కేరళ రాష్ట్రాలలో జిఎస్ఎస్ యొక్క దక్షిణ ప్రాంతంలో జియో శాస్త్రీయ కార్యకలాపాలు పూర్తిగా విస్తరించాయని. ఆరు రాష్ట్రాల్లోని వ్యవస్థాగత భౌగోళిక పఠ౦లో జిఎస్ఐ కార్యకలాపాలు విస్తరి౦చాయని ఈ స౦దర్భ౦గా ఆయన తెలిపారు.. 


(రిలీజ్ ఐడి: 1556698) సందర్శకుల సూచీ సంఖ్య : : 556
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English