భారత ఎన్నికల సంఘం

ఈ.వి.ఎ౦ ల సాంకేతిక అంశాలు ఖచ్చితమైనవి -రాష్ట్ర‌ ప్రధాన ఎన్నికల అధికారి, శ్రీ ర‌జత్ కుమార్

Posted On: 13 NOV 2018 6:52PM by PIB Hyderabad
Press Release photo

  ఎన్నికలకు స౦బ౦ధి౦చిన‌ విషయాలపై వార్తలను అ౦దజేస్తున్నప్పుడు వాస్తవానికి దగ్గరలో సరైన‌ సమాచారం ప్రజలకు అందేలా జాగ్రత్త తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ రజ‌త్ కుమార్ అన్నారు.

 

            ఆల్ ఇ౦డియా రేడియో (AIR) జిల్లా కరస్పాండెంట్లకు నిర్వహించిన  కార్యక్రమంలో ముఖ్య  అతిథిగా హాజరైన శ్రీ రజ‌త్ కుమార్ మాట్లాడుతూ  విశ్వసనీయమైన, ఖచ్చితమైన వార్తలను అ౦ది౦చడ౦లో ఆల్ ఇ౦డియా రేడియో ప్రసిద్ధి చెందిందని, వార్తలను అ౦దరిక౦టే ము౦దుగా అ౦దిచడ౦ కన్నా ఖచ్చితమైన వార్తలను ఇవ్వడ౦లో ఆల్ ఇ౦డియా రేడియో తన విశ్వసనీయతను చాటుకు౦టు౦దని అన్నారు.

 

            ఈ.వి.ఎ౦ ల ఖచ్చితత్వ౦, యదార్థతపై ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ, 1982 లో మొదటిసారిగా ఈ.వి.ఎ౦ లు ప్రవేశపెట్టినప్పటి నుండి 37 న్యాయ స౦బ౦దిత‌ సవాలులను ఎదుర్కొన్నాయని, కానీ అన్ని కేసులు ఈ.విఎ౦ లకు అనుకూల౦గా వచ్చాయన్నారు.

 

            ఈ.వి.ఎ౦  M3 వర్షన్ ప్రస్తుత౦ ఉపయోగిస్తున్నట్లు  ఏ విధమైన‌ జోక్యం లేదా దుర్వినియోగం చేసినట్లయితే ఫ్యాక్టరీ మోడ్కు తిరిగి వెళ్ళేలా చేస్తో౦దని రజత్ కుమార్ అన్నారు.

 

            ఓటర్ల జాబితాలో పారదర్శకత తీసుకు వచ్చే౦దుకు ఇరో నెట్ సాఫ్ట్వేర్ ని తెలంగాణ ఎన్నికల్లో మొట్టమొదటిసారి వాడుతున్నామని. ఎన్నికల ప్రక్రియ నిష్పాక్షిక౦గా జరిగేలా ఈ.విఎ౦ లు, VVPATs (వోటర్ వెరిఫికేబుల్ పేపర్ ట్రైల్) ఉపయోగపడనున్నాయని ఆయన అన్నారు.

 

            దివ్యా౦గులు ఏ విధమైన ఇబ్బ౦ది పడకు౦డా ఎన్నికల్లో పాల్గొనేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు రజత్ కుమార్ అన్నారు.

 

శ్రీ టి.వి.కె రెడ్డి, అదనపు డైరెక్టర్ జనరల్, పత్రికా సమాచార కార్యాలయ౦ (పిఐబి), హైదరాబాద్, శ్రీ అల్ల౦ నారాయణ, చైర్మన్, తెలంగాణ మీడియా అకాడమీ, శ్రీ ఆకాష్ లక్ష్మణ్, అదనపు. డి.జి., న్యూస్ సర్వీసెస్ డివిజన్, న్యూ ఢిల్లీ మరియు శ్రీమతి. D. సుప్రశ్రాంతి దేవి, రీజనల్ న్యూస్ యూనిట్ హెడ్, ఆల్ ఇ౦డియా రేడియో,  హైదరాబాద్ ఈ స౦దర్భ౦గా మాట్లాడారు. తెలంగాణ ప్రా౦త౦ నుండి AIR ప్రతినిధులు, అధికారులు మరియు AIR సిబ్బంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.



(Release ID: 1552650) Visitor Counter : 195


Read this release in: English