మంత్రిమండలి

ఐక్య‌ రాజ్య స‌మితి లో స‌భ్య‌త్వాన్ని క‌లిగి ఉన్న దేశాలు అన్నింటికీ అంత‌ర్జాతీయ సౌర కూట‌మి (ఐఎస్ఎ) యొక్క స‌భ్య‌త్వాన్ని ఇచ్చేందుకు వీలుగా ఐఎస్ఎ యొక్క ఫ్రేమ్ వ‌ర్క్ అగ్రిమెంటు ను స‌వ‌రించ‌డం కోసం ఫ‌స్ట్ అసెంబ్లీ ఆఫ్ ద ఇంట‌ర్ నేశ‌న‌ల్ సోల‌ర్ అల‌య‌న్స్ లో ఒక తీర్మానాన్ని తీసుకు రావ‌డానికి ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం

Posted On: 01 NOV 2018 11:39AM by PIB Hyderabad

ఐక్య‌ రాజ్య స‌మితి లో స‌భ్య‌త్వాన్ని క‌లిగి వున్న దేశాల‌న్నింటికీ  అంత‌ర్జాతీయ సౌర కూట‌మి (ఐఎస్ఎ) స‌భ్య‌త్వాన్ని ఇచ్చేందుకు వీలుగా ఐఎస్ఎ యొక్క ఫ్రేమ్ వ‌ర్క్ అగ్రిమెంటు ను స‌వ‌రించ‌డం కోసం ఫ‌స్ట్ అసెంబ్లీ ఆఫ్ ద ఇంట‌ర్ నేశ‌న‌ల్ సోల‌ర్ అల‌య‌న్స్ లో ఒక తీర్మానాన్ని తీసుకు రావ‌డానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త న జరిగిన కేంద్ర మంత్రివ‌ర్గ సమావేశం ఎక్స్- పోస్ట్ ఫాక్టో ఆమోదాన్ని తెలిపింది.

లాభాలు:

ఐఎస్ఎ లో స‌భ్య‌త్వానికి ఆస్కారం క‌ల్పించ‌డం సౌర శ‌క్తి ని గ్లోబ‌ల్ అజెండా లోకి తీసుకు పోతుంది.  ఇది సౌర శ‌క్తి ని అభివృద్ధి ప‌ర‌చాల‌ని మ‌రియు దానిని వినియోగించుకోచాల‌నే సార్వ‌త్రిక విజ్ఞ‌ప్తి ని కూడా చేస్తుంది.  ఇది ఐఎస్ఎ ను సంఘ‌టిత ప‌రుస్తుంది.  త‌ద్వారా, ఐక్య‌ రాజ్య స‌మితి లో స‌భ్య‌త్వం ఉన్న అన్ని దేశాలు దీని లో స‌భ్య‌త్వాన్ని పొంద‌వ‌చ్చును.  స‌భ్య‌త్వాన్ని విస్త‌రించినందువల్ల ఐఎస్ఎ కార్య‌క్ర‌మం విశాల విశ్వానికి ప్ర‌యోజ‌న‌కరం గా మారడానికి మార్గాన్ని సుగ‌మం చేయగలదు.


**



(Release ID: 1551600) Visitor Counter : 228