విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

నల్గొండ పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ సేవా కే౦ద్ర౦లో రేపటి నుండి ఆన్‌లైన్ ప‌ద్ధ‌తి లో పూర్తి స్థాయిలో కార్య‌క‌లాపాలు

Posted On: 03 OCT 2018 6:23PM by PIB Hyderabad

నల్గొండ లో ప్ర‌ధాన త‌పాలా కార్యాల‌య లో పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్ర (పిఒపిఎస్ కే) ఈ నెల 4వ తేదీ నుంచి ఆన్‌లైన్ ప‌ద్ధ‌తి లో పూర్తి స్థాయి కార్య‌క‌లాపాలు ప్రారంభించ‌నున్నారు. ఈ పిఒపిఎస్ కే ఇప్ప‌టికే ‘‘క్యాంప్ మోడ్‌’’ లో పనిచేస్తో౦దని సంబంధిత అధికారులు తెలిపారు. అయితేఈ ప‌ద్ధ‌తి లో ద‌ర‌ఖాస్తుదారులు వారి ఫైళ్ళు పూర్తిగా ప్రాసెస్ కావాలంటే 7 రోజుల నుంచి 10 రోజుల‌కు వేచి ఉండ‌వ‌ల‌సి వ‌స్తోంది.  ఈ జాప్యాన్ని నివారించ‌డం కోసం ఈ నెల 4వ తేదీ నుంచి ఆన్‌లైన్ ప‌ద్ధ‌తి లో పూర్తి స్థాయి కార్య‌క‌లాపాలు ప్రారంభించ‌నున్నారు.  దీనితో పోస్టాఫీస్ పాస్‌పోర్ట్  సేవా కేంద్ర లో దాఖ‌లు చేసిన అన్ని ద‌ర‌ఖాస్తుల ప్రాసెసింగ్ రాష్ట్రం లోని ఇత‌ర పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల తో స‌మానంగా అదే రోజున పూర్తి అవుతాయి.  నల్గొండ ప‌రిస‌ర ప్రాంతాల‌కు చెందిన పాస్‌పోర్ట్ ద‌ర‌ఖాస్తుదారులు ఈ మార్పును గ‌మ‌నించి తాజా స‌దుపాయాన్ని మెరుగైన రీతిలో ఉప‌యోగించుకోవాల‌ని తెలియ‌ జేయ‌డ‌మైంది.

                                                  ***  



(Release ID: 1548380) Visitor Counter : 133


Read this release in: English