మంత్రిమండలి

నార్క‌టిక్స్‌, డ్ర‌గ్స్, సైకోట్రాపిక్స్ స‌బ్‌స్టెన్సెస్‌ అండ్ ప్రిక‌ర్‌స‌ర్స్ ను అక్ర‌మంగా చేర‌వేయ‌డాన్ని అరిక‌ట్ట‌డం లో ప‌ర‌స్ప‌ర స‌హ‌కారం కోసం భార‌త‌దేశం, ఉజ్‌బెకిస్తాన్ ల మ‌ధ్య ఎంఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం

Posted On: 26 SEP 2018 4:21PM by PIB Hyderabad

నార్క‌టిక్స్‌, డ్ర‌గ్స్, సైకోట్రాపిక్స్ స‌బ్‌స్టెన్సెస్‌ అండ్ ప్రిక‌ర్‌స‌ర్స్ ను అక్ర‌మంగా చేర‌వేయ‌డాన్ని అరిక‌ట్ట‌డం లో ప‌ర‌స్ప‌ర స‌హ‌కారం కోసం భార‌త‌దేశం, ఉజ్‌బెకిస్తాన్ ల మ‌ధ్య అవ‌గాహ‌న పూర్వ‌క ఒప్పందం (ఎంఒయు) కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్యక్ష‌త‌న జ‌రిగిన కేంద్ర మంత్రివ‌ర్గ సమావేశం ఆమోదం తెలిపింది.

ప్ర‌యోజ‌నాలు:

ఈ ఎంఒయు మ‌త్తుమందులు, మ‌రియు సైకోట్రాపిక్స్ స‌బ్‌స్టెన్సెస్‌ ను నియంత్రించ‌డం లోను, డ్ర‌గ్ ట్రాఫికింగ్ పై పోరాడ‌డం లోను ప‌ర‌స్ప‌ర స‌హ‌కారానికి స‌హ‌య‌కారి కాగ‌ల‌దు.  గుర్తించిన రంగాల లో ప‌ర‌స్ప‌ర స‌హాయం మ‌రియు స‌హ‌కారం అవ‌స‌ర‌ప‌డే అన్ని అంశాల లో స‌మ‌ర్ధంగా వ్యవహరించడానికి ఈ ఎంఒయు సమర్ధంగా తోడ్ప‌డ‌గలదు.  ఉభ‌య ప్ర‌భుత్వాల మ‌ధ్య ద‌క్ష‌త క‌లిగిన సంస్థాగ‌తమైన ప‌నితీరు కు కూడా ఈ ఎంఒయు దోహ‌దం చేస్తుంది.  ఈ ఎంఒయు ఒక‌సారి అమ‌లు లోకి వ‌చ్చిందంటే గ‌నుక దేశాల న‌డుమ నార్క‌టిక్స్ ట్రాఫికింగ్ ను అరిక‌ట్ట‌డం లో ఇది స‌హాయకారి కాగ‌లుగుతుంది.


**



(Release ID: 1547517) Visitor Counter : 165