PIB Headquarters
మెదక్ పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రం లో పాస్‌పోర్ట్ దరఖాస్తుల ప్రాసెసింగ్ అదే రోజు పూర్తి
నాడు పోస్టు చేయడమైనది:
07 SEP 2018 6:45PM by PIB Hyderabad
మెదక్ ప్రధాన తపాలా కార్యాలయం లో ఏర్పాటైన పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్ర (పిఒపిఎస్‌కె) 2018వ సంవత్సరం మార్చి నెల 17వ తేదీ నాటి నుండి ‘‘క్యాంప్ మోడ్’’ లో పని చేస్తోందని ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం, హైదరాబాద్ తెలిపింది. ఇంతకు ముందు ‘క్యాంప్ మోడ్ ఆపరేషన్స్’ లో భాగంగా దరఖాస్తుదారులు వారి యొక్క పాస్‌పోర్ట్ దరఖాస్తులు ప్రాసెస్ కావడం కోసం వారం రోజుల నుండి 10 రోజుల పాటు ఎదురు చూడవలసి వచ్చేది. ఈ జాప్యాన్ని నివారించడం కోసం మెదక్ లోని పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాన్ని 2018 సెప్టెంబర్ నెల 6వ తేదీ నాటి నుంచి పిఎస్‌పి ఆన్‌లైన్ మోడ్ లోకి మార్చడం జరిగింది. ఈ పరివర్తన తో మెదక్ పిఒపిఎస్‌కె లో దాఖలు చేసిన దరఖాస్తులను రాష్ట్రం లోని ఇతర పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల తో సమానంగా అదే రోజున ప్రాసెసింగ్ పూర్తి చేయడం జరుగుతుంది. ఈ మార్పు ను దృష్టి లో పెట్టుకొని మెదక్ పరిసర ప్రాంతాలకు చెందిన పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులు ఈ సౌకర్యాన్ని ఉత్తమమైన రీతిలో వినియోగించుకోవాలని తెలియజేయడం జరుగుతోంది.
(రిలీజ్ ఐడి: 1545367)
సందర్శకుల సూచీ సంఖ్య : : 136