PIB Headquarters

ఆర్.ఓ.బి( కేంద్ర స‌మాచార మ‌రియు ప్ర‌సార మంత్రిత్వ శాఖ) ఆధ్వర్య౦లో ఆయుష్మాన్ భారత్, స్వచ్ఛ్ భారత్ మిషన్(అర్బన్)ల‌పై వ‌ర్క్ షాప్ నిర్వ‌హ‌ణ‌

Posted On: 07 SEP 2018 6:40PM by PIB Hyderabad

పేదల ఆరోగ్య బీమా కోసం కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెస్తున్న  ‘ఆయుష్మాన్ భారత్’  అమలు లో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని  బిజెపి రాష్ట్ర శాఖ అద్యక్షులు                డాక్టర్ కె.  లక్ష్మణ్ సూచించారు. ప్రజల విస్తృత ఆరోగ్య ప్రయోజనాల పరిరక్షణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆయుష్మాన్ భారత్’ కార్యక్రమాన్ని రూపొందించారనిఈ కార్యక్రమాన్ని అమలు చేయటంలో రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలని కోరారు. కేంద్ర సమాచార ప్రసార శాఖరీజనల్ అవుట్ రీచ్ విభాగం ఆయుష్మాన్ భారత్స్వచ్చ భారత్ మిషన్’ లపై హైదరాబాద్ లో ఒక రోజు కార్యశాలను ఆయన ఈ  ఉదయం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ,  ప్రజల భాగస్వామ్యంతోనే ప్రభుత్వ కార్యక్రమాలు ఆశించిన ఫలితాలు సాధిస్తాయని ఆయన అన్నారు.  ‘ఆయుష్మాన్ భారత్’ కార్యక్రమం ద్వారా యాభై కోట్ల మందికి పైగా ఆరోగ్య బీమా కల్పించే లక్ష్యంతో ఏడాదికికుటుంబానికి ఐదు లక్షల రూపాయిల విలువైన వైద్యబీమా అందిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల నుంచీ అమలయ్యే ఈ కార్యక్రమం పట్ల ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పేదల ఆరోగ్య సేవలను కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందనిఔషధాలను చౌకగా జనరిక్ ఔషధాల స్టోర్స్ ద్వారా అందుబాటులోకి తెచ్చిందని లక్ష్మణ్ చెప్పారు. స్వచ్చ భారత్’ కార్యక్రమం ఉద్దేశ్యాలను సాధించేందుకు యద్ద ప్రాతిపదికన చర్యలను కొనసాగించాలని ఆయన సూచించారు. మహిళల ఆత్మగౌరవ గృహాలుగా మరుగుదొడ్లను పరిగణించాలనిఈ విషయం పట్ల ప్రజలందరికీ అవగాహన కల్పించాలని ఆయన కోరారు. పట్టణ ప్రాంతాలలో  పేదలుండే బస్తీలలోముఖ్యంగా మహిళలు మరుగుదొడ్లు లేక ఎదుర్కొంటున్న న్యూన పరిస్దితిని రూపుమాపాలని అన్నారు. ప్రజల భాగస్వామ్యంతోపేదల్లో ఆత్మన్యూనత తొలగించే ఉద్యమంగా స్వచ్చ భారత్’ కార్యక్రమాన్ని ఆయన అభివర్ణించారు.  నాలుగేళ్ళలో ఏడు కోట్ల పైగా వ్యక్తిగత టాయిలెట్లను  నిర్మించారని లక్ష్మణ్ చెప్పారు.  ప్రజలను ఈ విషయాల్లో చైతన్య పరుస్తున్నందుకు ఆయన ఆర్ఒబి అధికారులుకళాకారులను అభినందించారు. 

పత్రికా సమాచార కార్యాలయం అదనపు డైరెక్టర్ జనరల్  శ్రీ టి.వి.కె. రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూకులంమతంవర్గం తో ప్రమేయం లేకుండా అందరికీ ఆరోగ్య బీమా అందించే ఆయుష్మాన్ భారత్’ కార్యక్రమం ఈ నెల 25 నుంచి అమలు అయ్యే ఆయుష్మాన్ భారత్’ పట్ల రాష్ట్రమంతటా తిరిగి ప్రజలకు అర్ధమయ్యేలా వివరించాలని కళాకారులకు సూచించారు.  తెలంగాణాలో దాదాపు 45 ట్రూపులున్నాయనివీరంతా రానున్న ఆరు నెలల పాటు ప్రజల్లోకి వెళ్ళి ఆయుష్మాన్ భారత్స్వచ్చ భారత్’ కార్యక్రమాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. 

కేంద్ర ఆరోగ్యంకుటుంబ సంక్షేమం  సీనియర్ రీజనల్ డైరెక్టర్ శ్రీ‌మ‌తి అనూరాధ మేడోజు మాట్లాడుతూ‘ఆయుష్మాన్ భారత్’ కార్యక్రమం 1345 రకాల  చికిత్సలను ప్రజలకు ఉచితంగా అందిస్తుందని చెప్పారు. ఆంద్రప్రదేశ్ ఈ కార్యక్రమ అమలుకు ఇప్పటికే అవగాహనా ఒప్పందం చేసుకుందనీతెలంగాణ రాష్ట్రం లో ఒప్పంద దిశగా పరిశీలన జరుగుతోందని  ఆమె తెలిపారు.  ప్రైవేటు ఆరోగ్య బీమా సంస్ధలు ఇచ్చే ఆరోగ్య సేవల కంటే ఎక్కువ సేవలను ఆయుష్మాన్ భారత్’ ద్వారా పొందవచ్చని ఆమె తెలిపారు. ఏటా కుటుంబానికి లక్షల రూపాయిల వరకు ఆరోగ్య బీమా లభిస్తుందన్నారు.

లెప్రసీ మిషన్ జాయింట్ డైరెక్టర్ జాన్ బాబు మాట్లాడుతూ, 2019 నాటికి కుష్టు వ్యాధి వైకల్యాలను రూపుమాపే లక్ష్యంతో కృషి చేస్తున్నట్లుఈ దిశగా కళాకారులు ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. 

రాష్ట్ర ఆరోగ్య  కుటుంబ సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీ‌మ‌తి సుకృతా రెడ్టి,  క్షేత్ర ప్రచార విభాగం జాయింట్ డైరెక్టర్ దేవేందర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

కేంద్ర సమాచార ప్రసార శాఖ,  రీజనల్ అవుట్ రీచ్ విభాగం ఆధికారులుకళాకారులు పెద్ద సంఖ్యలో ఈ కార్యశాలకు హాజరయ్యారు.

 

***

 


(Release ID: 1545364) Visitor Counter : 194


Read this release in: English