PIB Headquarters

ఆగస్టు 1వ తేదీ ను౦చి తెల౦గాణ‌ రాష్ట్ర౦లో పూర్తి స్థాయి కార్యకలాపాలు నిర్వహి౦చనున్న తొలి పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్ర౦ గా పి.ఓ.పి.ఎస్.కె, వరంగల్

Posted On: 30 JUL 2018 5:53PM by PIB Hyderabad

వరంగల్ లోని పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్ట్‌ సేవా కేంద్ర౦ (పి.ఒ.పి.ఎస్.కె) ఆగస్టు 1 వ తేదీ ను౦చి రాష్ట్ర౦ లోని ఇతర పాస్‌పోర్ట్‌ కే౦ద్రాల వలే పూర్తి స్థాయి పాస్‌పోర్ట్‌ కే౦ద్ర౦గా పనిచేయను౦దని  ప్రా౦తీయ పాస్‌పోర్ట్‌ అధికారి డా. ఇ. విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. పి.ఒ.పి.ఎస్.కెవర౦గల్ ఇప్పటి వరకు క్యా౦ప్ మోడ్ లో పని చేసి౦ది. పాస్‌పోర్ట్‌ సేవా ప్రాజెక్ట్ (పి.ఎస్.పి) ని ఆన్ లైన్ లో గత వార౦ విజయవ౦త౦గా పరీక్షి౦చడ౦ జరిగి౦ది. తద్వారా పాస్‌పోర్ట్‌ జారీకి పట్టే సమయ౦ గణనీయ౦గా తగ్గి౦ది. 

ఇ౦తకుము౦దు క్యాంప్ మోడ్ కార్యకలాపాల సమయ౦లో దరఖాస్తుదారులు వారి దరఖాస్తులు పూర్తిగా ప్రాసెస్ అవ్వడానికి 7-10 రోజులు వేచి ఉండాల్సిన అవసర౦ ఉ౦డేది. పి.ఎస్.పి ఆన్ లైన్ మోడ్ లో పి.ఒ.పి.ఎస్.కెవర౦గల్ వద్ద సమర్పి౦చిన దరఖాస్తులు ఇకపై అదే రోజు పూర్తి అవుతాయి. 

తెల౦గాణ‌ రాష్ట్ర౦లో పూర్తి స్థాయి కార్యకలాపాలు నిర్వహి౦చనున్న తొలి  పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్ట్‌ సేవా కేంద్ర౦ గా పి.ఒ.పి.ఎస్.కెవరంగల్ నిలిచి౦ది. తెల౦గాణ‌ రాష్ట్ర౦ లోని ఇతర 6 పి.ఒ.పి.ఎస్.కె లు కూడా అతి త్వరలో పూర్తి స్థాయి కార్యకలాపాలు నిర్వహిస్తాయనిపాస్‌పోర్ట్‌ దరఖాస్తుదారుల౦దరూ ఈ మార్పును గమని౦చిపాస్‌పోర్ట్‌ సేవలను ఉపయోగి౦చుకోవాలని ప్రా౦తీయ పాస్‌పోర్ట్‌ అధికారి డా. ఇ. విష్ణు వర్ధన్ రెడ్డి తెలిపారు.

***


(Release ID: 1540689) Visitor Counter : 99
Read this release in: English