రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

తెలంగాణ లో నాలుగు జాతీయ ర‌హ‌దారి ప‌థ‌కాల‌కు రేపు పునాదిరాయి వేయ‌నున్న కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గ‌డ్క‌రీ

Posted On: 04 MAY 2018 4:34PM by PIB Hyderabad

కేంద్ర ర‌హ‌దారి ర‌వాణా మ‌రియు హైవేలుషిప్పింగ్‌జ‌ల వ‌న‌రులున‌దుల అభివృద్ధి, ఇంకా గంగా న‌ది శుద్ధి శాఖ మంత్రి శ్రీ నితిన్ గ‌డ్క‌రీ తెలంగాణ రాష్ట్రం లో నాలుగు జాతీయ ర‌హ‌దారి ప‌థ‌కాల‌కు రేపు పునాది రాయి వేయ‌నున్నారు. హైద‌రాబాద్ లోని రామంత‌పూర్ లో గ‌ల హైద‌ర‌బాద్ ప‌బ్లిక్ స్కూల్ గ్రౌండ్స్ లో జ‌రుగ‌నున్న ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య‌మంత్రి శ్రీ కె. చంద్ర‌శేఖ‌ర‌రావు హాజ‌ర‌వుతారు.

1,523 కోట్ల రూపాయ‌ల వ్య‌యం తో చేప‌డుతున్న ఈ ప‌థ‌కాల‌లో, హైద‌రాబాద్ మ‌రియు బెంగ‌ళూరు మ‌ధ్య గల ఎన్‌హెచ్ 44 లో ఆరాంగ‌ఢ్- శంషాబాద్ సెక్ష‌ను ను ఆరు దోవ‌ల ర‌హ‌దారిగా తీర్చిదిద్ద‌డంఎన్‌హెచ్ 765డి లో హైద‌రాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు నుండి మెద‌క్ వరకు ఉన్న భాగం యొక్క స్థాయిని పెంచ‌డంఅంబ‌ర్‌పేట్- ఎక్స్ రోడ్స్ వ‌ద్ద నాలుగు దోవ‌ల ఫ్లయ్ ఓవ‌ర్ యొక్క నిర్మాణం పనులతో పాటు ఎన్‌హెచ్ 163 లో భాగ‌మైన‌ హైద‌రాబాద్-భూపాల‌ప‌ట్నం సెక్ష‌ను లో  ఉప్ప‌ల్ మొద‌లు నారాప‌ల్లి వ‌ర‌కు ఆరు దోవ‌ల ఎలివేటెడ్ కారిడార్ యొక్క నిర్మాణ ప‌నులు కూడా కలసి ఉంటాయి.

 

***



(Release ID: 1531371) Visitor Counter : 134


Read this release in: English