పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ

సూర్యాపేట లో ‘గ్రామ్ స్వరాజ్ అభియాన్’ ను ప్రారంభించిన కేంద్ర పెట్రోలియమ్ మరియు సహజ వాయువు శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్

‘తెలంగాణకు 20 లక్షల ఎల్ పిజి కనెక్షన్ లను ఇవ్వనున్న కేంద్రం’

Posted On: 14 APR 2018 6:56PM by PIB Hyderabad

   తెలంగాణ లోని సూర్యాపేట లో గ్రామ్ స్వరాజ్ అభియాన్ ను కేంద్ర పెట్రోలియమ్ మరియు సహజ వాయువు శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఈ రోజు ప్రారంభించారు.  ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూకేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన లో భాగంగా 20 లక్షల ఎల్ పిజి కనెక్షన్ లను తెలంగాణ రాష్ట్రానికి  సమకూర్చుతుందని తెలిపారు.  మహబూబాబాద్జయశంకర్ భూపాలపల్లికాన్ స్టాంటినోస్ భీమ్ ఆసిఫాబాద్ ల వంటి తెలంగాణ జిల్లా లలో ఎల్ పిజి కి నోచుకోనటువంటి కుటుంబాలు ఉన్నాయని ఆయన చెప్పారు.  వినియోగదారులకు 6 ఎల్ పిజి రీఫిల్స్ ను సబ్సిడీపై  అందజేయడం జరుగుతుందన్నారు.  తెలంగాణ లో 707 పంపిణీ పాయింట్లు ఉన్నాయనిత్వరలో మరిన్ని తెరచి ఈ పాయింట్ల సంఖ్యను 1000 కి చేర్చడం జరుగుతుందని శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు.  ఎల్ పిజి పంపిణీ అవుట్ లెట్ లేని మండలం అంటూ ఉండబోదు అని కేంద్ర మంత్రి స్పష్టంచేశారు.

     పొగ వచ్చే పొయ్యిలపై వంట చేస్తున్న మహిళల ఇక్కట్లను తీర్చడం కోంస ఎల్ పిజి కనెక్షన్ లను ఇస్తామని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారని శ్రీ ప్రధాన్ గుర్తుచేశారు.  కేంద్రం గత నాలుగు సంవత్సరాలలో 3 కోట్ల 46 లక్షల ఎల్ పిజి కనెక్షన్ లను సమకూర్చిందని ఆయన అన్నారు.  గ్రామ్ స్వరాజ్ అభియాన్ ను మన రాజ్యాంగ శిల్పి అయిన బాబా సాహెబ్ ఆంబేడ్ కర్ జయంతి దినమైన ఏప్రిల్ 14వ తేదీ నుండి 2018 మే నెల 5వ తేదీ వరకు అమలుచేయడం జరుగుతుందని కేంద్ర మంత్రి వివరించారు. పేదలు మరియు అణగారిన వర్గాల ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు.

పార్లమెంట్ సభ్యుడు శ్రీ బండారు దత్తాత్రేయ, శాసనసభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్, ఎమ్ఎల్ సి శ్రీ రామచందర్ రావు, హెచ్ పిసిఎల్, బిపిసిఎల్, ఇంకా ఐఒసిఎల్ లకు చెందిన అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 

***


(Release ID: 1529127) Visitor Counter : 149


Read this release in: English