పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ

పెట్రోలియ‌మ్ & స‌హ‌జ‌వాయువు రంగంలో వ్యాపారం చేసుకోవడాన్ని సులభతరంగా మలచే దిశగా ఒక ప్రోత్సాహక చర్య

అంత‌ర్జాతీయ స్ప‌ర్ధాత్మ‌క బిడ్డింగ్ (ఐసిబి) అనంత‌రం హెచ్ఇఎల్‌పి /ఒఎఎల్‌పి ల‌లో భాగంగా బ్లాకులను/కాంట్రాక్టు ఏరియాలను స‌ఫ‌లీకృతులైన బిడ్డ‌ర్ లకు ఇవ్వ‌డానికి ఆమోదముద్ర వేసే అధికారాల‌ను పెట్రోలియ‌మ్ మ‌రియు స‌హ‌జ‌వాయువు శాఖ మంత్రి కి, ఇంకా ఆర్థిక శాఖ మంత్రి కి అప్ప‌గించేందుకు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం

Posted On: 11 APR 2018 2:02PM by PIB Hyderabad

కార్య‌ద‌ర్శుల సాధికారిక సంఘం (ఇసిఎస్‌) సిఫార‌సుల ప్రాతిప‌దిక‌న జ‌రిగే అంత‌ర్జాతీయ స్ప‌ర్ధాత్మ‌క బిడ్డింగ్ (ఐసిబి) అనంత‌రం హైడ్రోకార్బ‌న్ అన్వేషణ మ‌రియు అనుమతి విధానం (హెచ్ఇఎల్‌పి) లో భాగంగా బ్లాకులను/కాంట్రాక్టు ఏరియాల ను స‌ఫ‌లీకృతులైన బిడ్డ‌ర్ లకు ఇవ్వ‌డానికి ఆమోదం తెలిపే అధికారాల‌ను పెట్రోలియ‌మ్ మ‌రియు స‌హ‌జ‌వాయువు శాఖ మంత్రి కి, ఇంకా ఆర్థిక శాఖ మంత్రి కి అప్ప‌గించేందుకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశమైన కేంద్ర మంత్రి వ‌ర్గం ఆమోదం తెలిపింది.  వ్యాపారం చేసుకోవడాన్ని సులభతరంగా మలచాల‌న్న ప్ర‌భుత్వ చొర‌వ‌ లో భాగంగా ఈ మేర‌కు నిర్ణ‌యాన్ని తీసుకోవ‌డ‌మైంది.  బ్లాకుల‌ను హెచ్ఇఎల్‌పి లో భాగంగా ఒక సంవ‌త్స‌రంలో రెండు సార్లు కేటాయిస్తున్నారు.  అందువ‌ల్ల అధికారాల‌ను అప్ప‌గించాల‌నే ఈ చ‌ర్య బ్లాకుల కేటాయింపున‌కు సంబంధించిన నిర్ణ‌యాలు తీసుకొనే ప్ర‌క్రియ‌ ను వేగ‌వంతం చేయ‌డ‌మే కాక వ్యాపారం చేసుకోవడాన్ని సుల‌భతరంగా మలచేందుకు మార్గాన్ని సుగమం చేస్తుంది.
 

ప్ర‌భావం:

ఎన్ఇఎల్‌పి విధానంలో భాగంగా బిడ్ ఇవాల్యుయేష‌న్ క్రైటీరియా (బిఇసి) ని ఇసిఎస్ ప‌రిశీలిస్తుంది.  బ్లాకుల‌ను కేటాయించ‌డం పై అవ‌స‌ర‌మైన చోటల్లా బిడ్డ‌ర్ లతో సంప్ర‌దింపులు జ‌రుపుతుంది.  ఇసిఎస్ త‌న సిఫార‌సుల‌ను సిసిఇఎ దృష్టికి తీసుకుపోతుంది.  బ్లాకుల కేటాయింపునకు సిసిఇఎ ఆమోద ముద్ర వేస్తుంది.  అంత‌ర్ మంత్రిత్వ శాఖ సంప్ర‌దింపులు (ఐఎమ్‌సి) తో స‌హా ఈ ప్ర‌క్రియ అంతా సుదీర్ఘ‌ం కావడంతో పాటు బోలెడు స‌మ‌యాన్ని కూడా తీసుకొంటోంది.  బ్లాకుల/ కాంట్రాక్టు ఏరియాల కేటాయింపున‌కు ప‌డుతున్న వ్య‌వ‌ధిని ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్నటువంటి ‘వ్యాపారం చేసుకోవడాన్ని సరళతరంగా మలచే’ కార్య‌క్ర‌మానికి త‌గ్గట్టుగా కుదించ‌డం అభిల‌ష‌ణీయంగా ఉండగలదు.  నూత‌న హైడ్రోకార్బ‌న్ అన్వేష‌ణ మ‌రియు అనుమతి జారీ విధానం లో భాగంగా స్ప‌ర్ధాత్మ‌క బిడ్డింగ్ నిరంత‌రంగా కొన‌సాగుతూంటుంది; బ్లాకుల‌ను ఒక సంవ‌త్స‌రంలో రెండు ప‌ర్యాయాలు కేటాయిస్తూ పోతారు.

పూర్వ‌రంగం:

హైడ్రోకార్బ‌న్ అన్వేష‌ణ మ‌రియు అనుమతి విధానం (హెచ్ఇఎల్‌పి) పేరిట అన్వేష‌ణ మ‌రియు ఉత్ప‌త్తి (ఇ&పి) రంగం కోసం ఒక కొత్త విధాన ప‌ర‌మైన వ్య‌వ‌స్థ‌ ను భార‌త ప్ర‌భుత్వం 2016 వ సంవ‌త్స‌రంలో మొదలుపెట్టింది.  మునుప‌టి విధాన వ్య‌వ‌స్థ‌ తో పోలిస్తే నూతన విధానం రూపావ‌ళి ప‌రంగా ఒక ప్ర‌ధాన‌మైన అడుగు అని చెప్పాలి.  నూత‌న విధానం ముఖ్యాంశాల‌లో.. రాబ‌డి పంప‌కం కాంట్రాక్టు, సంప్ర‌దాయ మ‌రియు సంప్ర‌దాయేతర హైడ్రోకార్బ‌న్ వ‌న‌రుల అన్వేష‌ణ‌కు, ఉత్ప‌త్తికి ఒకటే లైసెన్సు, మార్కెటింగ్ ప‌రంగాను, ధ‌ర‌ల నిర్ణ‌యం ప‌రంగాను స్వేచ్ఛ‌..ల వంటివి ముఖ్య‌మైన‌వి.  కాగా, హెచ్ఇఎల్‌పి లో ఓపెన్ ఎక‌రేజ్ లైసెన్సింగ్ పాలిసి (ఒఎఎల్‌పి) ఒక ప్ర‌ధాన‌మైన వినూత్న అంశంగా తెర మీద‌కు వ‌చ్చింది.  ఇందులో భాగంగా ఇన్వెస్ట‌రు త‌న స్వీయ ప్ర‌యోజ‌నం కొర‌కు బ్లాకుల‌ను ఏర్పరచుకోవ‌చ్చు.  ఏడాది పొడ‌వునా ఎక్స్‌ప్రెశన్ ఆఫ్ ఇంట‌రెస్టు (ఇఒఐ) ని దాఖ‌లు చేయ‌వ‌చ్చు.  ఎక్స్‌ప్రెశన్ ఆఫ్ ఇంట‌రెస్ట్ ను వ్య‌క్తం చేసిన ప్రాంతాల ఆధారంగా ప్ర‌తి 6 నెల‌ల‌కు బిడ్డింగు ను నిర్వ‌హిస్తారు.
 
2017 జులై 1వ తేదీన ప్రారంభించి  2017 న‌వంబ‌ర్ 15న ముగించిన ఒఎఎల్‌పి యొక్క ఒక‌టో ఇఒఐ కి ప్ర‌భుత్వం బ్ర‌హ్మాండ‌మైన ప్ర‌తిస్పంద‌నను అందుకొన్న‌ది.  11 రాష్ట్రాల‌లో 59282 చ‌ద‌ర‌పు కిలో మీట‌ర్ల విస్తీర్ణంలోని 55 బ్లాకుల‌ను ఒక‌టో విడత బిడ్ లో ఇవ్వ‌జూపారు.  బిడ్డింగు ప్ర‌క్రియ‌ను సుర‌క్షిత‌మైన మ‌రియు ప్ర‌త్యేకించిన‌టువంటి ఇ-బిడ్డింగ్ పోర్ట‌ల్ ద్వారా చేప‌డుతున్నారు.


***



(Release ID: 1528652) Visitor Counter : 124


Read this release in: English , Tamil , Malayalam