మంత్రిమండలి

రైల్వేల రంగంలో భార‌త‌దేశం, మొరాకో ల మ‌ధ్య స‌హ‌కార ఒప్పందానికి ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం

Posted On: 20 FEB 2018 1:20PM by PIB Hyderabad

రైల్వేల రంగంలో వివిధ విభాగాల‌లో దీర్ఘాకాలిక స‌హ‌కారాన్ని మ‌రియు భాగ‌స్వామ్యాన్ని అభివృద్ధి ప‌ర‌చ‌డం కోసం భార‌త‌దేశానికి, మొరాక‌న్ నేషన‌ల్ రైల్వేస్ ఆఫీస్ (ఒఎన్‌సిఎఫ్‌) కు మ‌ధ్య ఒక స‌హ‌కార పూర్వక ఒప్పందానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివ‌ర్గం ఎక్స్‌-పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది.  ఈ స‌హ‌కార పూర్వ‌క ఒప్పందం పై 2017 డిసెంబ‌ర్ 14వ తేదీన సంత‌కాలయ్యాయి.  
 
ఈ స‌హ‌కార పూర్వ‌క ఒప్పందం దిగువన పేర్కొన్న విభాగాల‌లో సాంకేతిక సంబంధ స‌హ‌కారానికి  తోడ్ప‌డ‌నుంది:
 
ఎ.  శిక్ష‌ణ మ‌రియు సిబ్బంది సంబంధ వికాసం;

బి.  నిపుణుల బృందం ప‌ర్య‌ట‌న‌లు, సిబ్బందితో పాటు అనుభ‌వాన్ని ప‌ర‌స్ప‌రం ఇచ్చి పుచ్చుకోవ‌డం; ఇంకా

సి.  నిపుణుల ఆదాన ప్ర‌దానం స‌హా, ప‌ర‌స్ప‌ర సాంకేతిక స‌హాయాన్ని ఒక పక్షానికి మరొక పక్షం అంద‌జేసుకోవ‌డం.

పూర్వ‌రంగం:

రైలు రంగంలో సాంకేతిక స‌హ‌కారం కోసం వేరు వేరు విదేశీ ప్ర‌భుత్వాల‌తో మ‌రియు నేష‌న‌ల్ రైల్వేస్ తో రైల్వేల మంత్రిత్వ శాఖ ప‌లు ఎమ్ఒయు ల‌ను కుదుర్చుకొంది.  హై-స్పీడ్ కారిడార్లు, ఇప్ప‌టికే ఉన్న మార్గాల‌లో వేగాన్ని పెంచ‌డం, ప్ర‌పంచ శ్రేణి స్టేష‌న్ ల‌ను అభివృద్ధిప‌ర‌చ‌డం, భారీ ప‌రిమాణంలో లోడులను లాగే కార్య‌క‌లాపాలు, రైల్వే అవ‌స్థాప‌న సంబంధ ఆధునికీక‌ర‌ణ, త‌దిత‌ర విభాగాలు స‌హ‌కారానికి గుర్తించిన‌టువంటి విభాగాల్లో ఉన్నాయి.  రైల్వేస్ సంబంధ సాంకేతిక‌త, ఇంకా కార్య‌క‌లాపాలు, విజ్ఞానాన్ని పంచుకోవడం, సాంకేతిక బృందాల ప‌ర్య‌ట‌న‌లు, ప‌ర‌స్ప‌ర ప్ర‌యోజ‌నాలు ముడిప‌డి ఉండే శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు & చ‌ర్చా స‌భ‌లు మ‌రియు కార్య‌శాల‌ల నిర్వ‌హ‌ణ‌.. వీటికి సంబంధించిన అభివృద్ధి స‌మాచారాన్ని ఒక ప‌క్షానికి మ‌రొక ప‌క్షం అందజేసుకోవ‌డం ద్వారా నిర్దేశిత స‌హ‌కారాన్ని పొంద‌డం జ‌రుగుతుంది.
 
రైల్వే రంగంలో విజ్ఞానాన్ని గురించి, తాజా ప‌రిణామాల‌ను గురించి అవ‌త‌లి ప‌క్షంతో సంప్ర‌దింపులు జ‌ర‌ప‌డానికి భార‌తీయ రైల్వేల చెంత‌న ఉన్న స‌మాచారాన్ని అవ‌త‌లి ప‌క్షంతో పంచుకోవ‌డానికి ఒక వేదిక‌ను ఈ ఎమ్ఒయు లు స‌మ‌కూరుస్తాయి.  సాంకేతిక నిపుణుల బృందాల ఆదాన ప్ర‌దానానికి, నివేదిక‌లు మ‌రియు సాంకేతిక ద‌స్తావేజు పత్రాలు, శిక్ష‌ణ మ‌రియు నిర్ధిష్ట సాంకేతిక విజ్ఞాన విభాగాలపై ప్రత్యేక శ్రద్ధతో కూడిన చ‌ర్చా స‌భ‌లు, కార్య‌శాల‌ల నిర్వ‌హ‌ణ‌ వంటి కార్యక్రమాలతో విజ్ఞానాన్ని ఒక‌రికి మ‌రొక‌రు అంద‌జేసుకోవ‌డానికి ఉద్దేశించిన ఇత‌ర‌త్రా ఇష్టాగోష్టుల‌కు మార్గాన్ని ఈ ఎమ్ఒయు లు సుగమం చేస్తాయి.
 

***



(Release ID: 1521147) Visitor Counter : 88


Read this release in: English , Assamese , Gujarati , Tamil