మంత్రిమండలి

ఇన్‌సోల్వన్సి అండ్ బ్యాంక్‌ర‌ప్ట‌సీ కోడ్ (అమెండ్‌మెంట్‌) ఆర్డినెన్సు, 2017 కు బ‌దులుగా ఇన్‌సోల్వన్సి అండ్ బ్యాంక్‌ర‌ప్ట‌సీ కోడ్ (అమెండ్‌మెంట్‌) బిల్లు, 2017 కు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం

Posted On: 07 FEB 2018 8:16PM by PIB Hyderabad

ఇన్‌సోల్వన్సి అండ్ బ్యాంక్‌ర‌ప్ట‌సీ కోడ్ (అమెండ్‌మెంట్‌) బిల్లు, 2017 కు ప్ర‌త్యామ్నాయంగా ప్ర‌తిపాదించిన బిల్లు లోని మార్పుల‌కు ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన‌ కేంద్ర మంత్రివ‌ర్గం ఎక్స్- పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది.  ఈ బిల్లును ఇన్‌సోల్వన్సి అండ్ బ్యాంక్‌ర‌ప్ట‌సీ కోడ్ (అమెండ్‌మెంట్‌) యాక్ట్, 2018 పేరిట పార్ల‌మెంటు ఆమోదించింది.

ఈ సవరణ - దివాలా తీసిన కార్పొరేట్ ప‌ర్స‌న్ తాలూకు రెజల్యూశన్ ప్రాసెస్ లో కొంద‌రు వ్య‌క్తుల అడ్డగింత పై స్పష్టతనిస్తుంది; ఉద్దేశరహిత వ్య‌క్తులకు చోటివ్వకుండానూ  చూస్తుంది.  అలాగే, వ‌సూలు కాని రుణం (ఎన్ పిఎ)గా వ‌ర్గీక‌రించినటువంటి ఖాతాను కలిగిన వ్య‌క్తికి  మ‌రింత ధర్మ బ‌ద్ధమైన అవ‌కాశాన్ని కూడా- క‌ల్పిస్తుంది.

***



(Release ID: 1519972) Visitor Counter : 93


Read this release in: English , Tamil