మంత్రిమండలి

రెండుసార్లు ప‌న్ను విధింపును నివారించ‌డం మ‌రియు ప్ర‌భుత్వ కోశ‌ సంబంధిత ఎగ‌వేత‌ ను నిరోధించ‌డం కోసం చైనా కు మ‌రియు భార‌త‌దేశానికి మ‌ధ్య ఒప్పందాన్ని స‌వ‌రించేందుకు ఉద్దేశించిన ఒడంబ‌డిక‌ల ప్రాథ‌మిక ప‌త్రం పై స‌ంత‌కాల‌కు, ఇంకా అనుమోదానికి ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం

Posted On: 07 FEB 2018 8:18PM by PIB Hyderabad

ఆదాయపు ప‌న్నుల‌కు సంబంధించినంతవరకు రెండు సార్లు పన్ను విధింపును నివారించ‌డం కోసం మ‌రియు ప్ర‌భుత్వ కోశ‌ సంబంధిత ఎగ‌వేత‌ను నిరోధించ‌డం కోసం చైనా కు, భార‌త‌దేశానికి మ‌ధ్య ఉన్న ఒప్పందాన్ని స‌వ‌రించేందుకు ఉద్దేశించిన ఒడంబ‌డిక‌ల ప్రాథ‌మిక ప‌త్రం పై స‌ంత‌కాల‌తో పాటు దీని అనుమోదానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది.

ఇత‌ర మార్పుల‌కు తోడు, స‌మాచార ఆదాన ప్ర‌దానానికి ఇప్పుడు అనుస‌రిస్తున్న నియ‌మ నిబంధ‌న‌ల‌ను ప్రాథ‌మిక ఒడంబ‌డిక‌ల ఒప్పంద ప‌త్రం అతి నూత‌న‌మైన అంత‌ర్జాతీయ ప్ర‌మాణాలకు అనుగుణంగా  తాజా ప‌రుస్తుంది.  దీనికి అద‌నంగా, భార‌త‌దేశం స‌మాన‌మైన ప్రాతిప‌దిక‌తో పాలుపంచుకొన్న‌టువంటి బేస్ ఇరోఝన్ & ప్రాఫిట్ శిఫ్టింగ్ (బిఇపిఎస్‌) ప్రాజెక్టు యొక్క కార్యాచ‌ర‌ణ‌ నివేదిక‌లలో భాగంగా పాటించ‌వ‌ల‌సిన క‌నీస ప్ర‌మాణాల తాలూకు ఒప్పందాన్ని అమ‌లుప‌ర‌చేందుకు అవ‌స‌ర‌మైన మార్పుల‌ను ఈ ఒడంబ‌డిక‌ల ప్రాథ‌మిక ప‌త్రం జోడిస్తుంది కూడా.  క‌నీస ప్ర‌మాణాల‌తో పాటు, ఉభ‌య ప‌క్షాలు స‌మ్మ‌తించిన మేర‌కు బిఇపిఎస్ కార్యాచ‌ర‌ణ నివేదిక‌లలో పేర్కొన్న ప్ర‌కారం మార్పుల‌ను సైతం ఈ ఒడంబ‌డిక‌ల ప్రాథ‌మిక ప‌త్రం తీసుకువస్తుంది.

***



(Release ID: 1519969) Visitor Counter : 62


Read this release in: English , Tamil