మంత్రిమండలి

నైపుణ్యాల అభివృద్ధి, వృత్తి సంబంధిత విద్య మ‌రియు శిక్ష‌ణ ల రంగంలో స‌హ‌కారం కోసం యునైటెడ్ కింగ్ డ‌మ్ ఆఫ్ గ్రేట్ బ్రిట‌న్ మ‌రియు నార్దర్న్ ఐర్లండ్ ల‌తో ఒక ఎంఒయు పై సంత‌కాల‌కు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం

Posted On: 07 FEB 2018 8:27PM by PIB Hyderabad

నైపుణ్యాల అభివృద్ధి, వృత్తి సంబంధిత విద్య మ‌రియు శిక్ష‌ణ ల రంగంలో స‌హ‌కారం కోసం యునైటెడ్ కింగ్ డ‌మ్ ఆఫ్ గ్రేట్ బ్రిట‌న్ తోను, నార్దర్న్ ఐర్లండ్ తోను ఒక అవ‌గాహ‌నపూర్వ‌క ఒప్పంద ప‌త్రం (ఎంఒయు) పైన సంత‌కాల‌కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది.

ఈ ఎంఒయు వృత్తి సంబంధ విద్య, వృత్తి సంబంధ శిక్ష‌ణ మ‌రియు నైపుణ్యాల అభివృద్ధి రంగంలో ఉభ‌య దేశాల‌కు మ‌ధ్య స‌న్నిహితమైన ద్వైపాక్షిక స‌హ‌కారానికి బాట వేస్తుంది.

విదేశాల‌తో స‌మ‌న్వ‌యాన్ని కుదుర్చుకోవ‌డంనైపుణ్య సంబంధ వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేసుకోవడంలో భార‌త‌దేశానికి తోడ్ప‌డగలదు.  దీని ద్వారా యువ‌త కు శ్రేష్ట‌త‌ర‌మైన ఉపాధి అవ‌కాశాలు దక్కేటట్టు వారి నైపుణ్యాల‌కు ప‌దును పెట్టడం సాధ్యపడుతుంది.  యునైటెడ్ కింగ్ డ‌మ్ మ‌రియు భార‌త‌దేశం లోని ప‌రిశ్ర‌మ‌లు మరియు శిక్ష‌ణ సంస్థ‌ల మ‌ధ్య సృజ‌న‌శీల భాగ‌స్వామ్యానికి ఈ ఎంఒయు ఒక ఫ్రేమ్ వ‌ర్క్ ను ఏర్ప‌ర‌చ‌డంతో పాటు భార‌త‌దేశంలో నైపుణ్య శిక్ష‌ణ ప్ర‌య‌త్నాల‌ను వృద్ధి ప‌ర‌చి, వాటి నాణ్య‌త‌ను పెంపొందించ‌డంలో కూడా దోహ‌దం చేయగలదు.  ఈ ఎంఒయు ను అమ‌లుప‌ర‌చ‌డానికి సంబంధించిన ప్రాజెక్టుల‌కు ఆర్థిక స‌హాయాన్ని- ఇరు ప‌క్షాలు ప‌ర‌స్ప‌రం అంగీక‌రించే మేర‌కు, విడి విడిగా సొంత ఏర్పాట్లను చేసుకోవడం ద్వారా  - స‌మ‌కూర్చుకోవ‌డం జ‌రుగుతుంది.

పూర్వ‌రంగం:

నైపుణ్యాల‌ను అభివృద్ధిప‌ర‌చుకోవడం భార‌త‌దేశానికి మరియు యునైటెడ్ కిండ్ డ‌మ్ కు జాతీయ స్థాయి ప్రాథమ్యం క‌లిగిన అంశంగా ఉంది.  అంతేకాదు, ద్వైపాక్షిక భాగ‌స్వామ్యంలో ఇది ఒక కీల‌క‌మైన భాగంగా కూడా ఉంది.  నైపుణ్యాలకు సాన పట్టడం, ఇంకా ఔత్సాహిక పారిశ్రామిక‌వేత్త‌ల‌కు ద‌న్నుగా నిల‌వ‌డాన్ని ప‌ర‌స్ప‌ర స‌మన్వయం అవసరమైన ప్రాథమ్య రంగాల‌లో ఒక రంగంగా ప్ర‌ధాన మంత్రులు ఇరువురూ 2016 న‌వంబ‌ర్ లో ఆమోదించి సంతకం చేశారు.

***



(Release ID: 1519961) Visitor Counter : 52


Read this release in: English