ఆర్థిక మంత్రిత్వ శాఖ
మౌలిక సదుపాయాల రంగానికి కేటాయింపును రూ.5.97 లక్షల కోట్లకు పెంచడమైంది; రవాణా రంగానికి ఇదివరకు ఎన్నడూ లేనంత అధిక స్థాయి కేటాయింపులు
విమానాశ్రయాల సామర్థ్యం విస్తరణ కోసం నభ్ నిర్మాణ్ కార్యక్రమ ప్రకటన; 10 ఐకోనిక్ టూరిజమ్ డెస్టినేషన్ లను అభివృద్ధి చేయనున్నారు
డిజిటల్ ఇండియా కార్యక్రమానికి కేటాయింపు రెట్టింపు; సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ కోసం ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు
రూ.10000 కోట్ల తో టెలికం రంగ మౌలిక సదుపాయాల కల్పనకు మరియు ఆ సదుపాయాల పెంపు
రూ.9.46 లక్షల కోట్ల విలువైన ఇన్ ఫ్రా ప్రాజెక్టుల త్వరితగతి అమలుకు తోడ్పడిన ఆన్ లైన్ పర్యవేక్షక వ్యవస్థ ‘ప్రగతి’
Posted On:
01 FEB 2018 1:38PM by PIB Hyderabad
ఆర్థిక వ్యవస్థ వర్ధిల్లేందుకు మౌలిక సదుపాయాల రంగాన్ని ఒక చోదక శక్తిగా ఈ రంగాన్ని గుర్తించిన ప్రభుత్వం 2018-19 కేంద్ర బడ్జెటు లో మౌలిక సదుపాయాల రంగానికి కేటాయింపును పెంచింది. ఈ రంగానికి బడ్జెటరీ, ఎక్స్ ట్రా బడ్జెటరీ వ్యయాన్ని 2017-18 లో రూ.4.94 లక్షల కోట్ల స్థాయి నుండి 2018-19 లో రూ.5.97 లక్షల కోట్ల కు పెంచడం జరిగింది. రవాణా రంగానికి ఇదివరకు ఎన్నడూ ఎరుగని విధంగా రూ.1,34,572 కోట్లను కేటాయించడమైంది. అలాగే, విపత్తులకు తట్టుకొని నిలచే మౌలిక సదుపాయాల కల్పనకు ఊతమివ్వడం కోసం 2018-19 లో 60 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీ అరుణ్ జైట్లీ 2018-19 సాధారణ బడ్జెటు ను ఈ రోజు పార్లమెంట్ లో ప్రవేశపెడుతూ ఈ అంశాలను ప్రకటించారు.
నగర సంబంధ అవస్థాపన రంగంలో, పది ప్రముఖ యాత్రాస్థలాలను అవిభాజ్య తత్వ సంబంధ మౌలిక సదుపాయాల కల్పన మరియు నైపుణ్యాల అభివృద్ధి ద్వారా ఐకోనిక్ టూరిజమ్ డెస్టినేషన్ లుగా తీర్చిదిద్దుతారు. దీనికి అదనంగా, ఆర్కియలోజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఎఎస్ఐ) యొక్క 100 ఆదర్శ కట్టడాల వద్ద పర్యాటక సౌకర్యాలను మెరుగుపరుస్తారు. ప్రభుత్వ ‘స్మార్ట్ సిటీస్ మిషన్’ మరియు ‘ఎఎమ్ఆర్ యుటి’ (AMRUT) కార్యక్రమాలలో భాగంగా చేపడుతున్న పనులను శ్రీ అరుణ్ జైట్లీ ప్రశంసించారు. ‘స్మార్ట్ సిటీస్ మిషన్’ లో భాగంగా 2.04 లక్షల కోట్ల రూపాయల వ్యయంతో 99 నగరాలను ఎంపిక చేయడం జరిగిందని ఆయన తెలిపారు. 2,350 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు పూర్తి అయ్యాయి. మరో 20,852 కోట్ల రూపాయల విలువైన పనులు పురోగతిలో ఉన్నాయి. వారసత్వ నగరాలను పునరుత్తేజితం చేసేందుకుగాను నేషనల్ హెరిటేజ్ సిటీ డెవలప్ మెంట్ అండ్ ఆగ్ మెంటేషన్ యోజన (HRIDAY) ను చేపట్టారు.
‘ఎఎమ్ఆర్ యుటి’ (AMRUT) కార్యక్రమంలో భాగంగా 500 నగరాలకు రూ.77,640 కోట్ల తో రాష్ట్ర స్థాయి ప్రణాళికలను ఆమోదించారు. 19,428 కోట్ల రూపాయల విలువైన 494 ప్రాజెక్టులకు సంబంధించిన నీటి సరఫరా కాంట్రాక్టులను, 12,429 కోట్లు ఖర్చయ్యే 272 ప్రాజక్టులకు సంబంధించిన మురుగునీటి పారుదల పనుల కాంట్రాక్టులను మంజూరు చేయడమైంది. 144 నగరాలు ఇన్వెస్ట్ మెంట్ గ్రేడ్ రేటింగ్ ను పొందాయి.
రహదారుల రంగంలో, ఇటీవలే ఆమోదించినటువంటి భారత్ మాల పరియోజన ఒకటో దశలో 5,35,000 కోట్ల ఖర్చుతో సుమారు 35,000 కిలోమీటర్ల మేర హైవేలను అభివృద్ధిపరచాలని లక్ష్యంగా నిర్దేశించుకొన్నారు.
సరిహద్దు ప్రాంతాలలో అనుసంధానాన్ని మెరుగుపరచే క్రమంలో, సేలా పాస్ దిగువన సొరంగ నిర్మాణ పనులను ప్రభుత్వం చేపడుతుందని ఆర్థిక మంత్రి ప్రకటించారు.
పౌర విమానయాన రంగంలో, ఒక సంవత్సరంలో ఒక బిలియన్ ప్రయాణాలను హ్యాండిల్ చేసే లక్ష్యంతో విమానాశ్రయాల సామర్థ్యాన్ని అయిదు రెట్లకు పైగా విస్తరించేందుకు నభ్ నిర్మాణ్ (NABH Nirman) పేరిట ఒక కొత్త కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు 2018-19 బడ్జెట్ లో ప్రకటించారు. ఈ విస్తరణకు అవసరమయ్యే నిధులను.. ఏర్ పోర్ట్ స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆస్తి అప్పుల పట్టీ ద్వారా అధిక లాభం పొందేందుకు ప్రయత్నించి.. సమీకరించడం జరుగుతుంది.
డిజిటల్ ఇండియా కార్యక్రమానికి 2018-19 బడ్జెట్ లో 3,073 కోట్ల రూపాయలను కేటాయించారు.
రోబోటిక్స్, కృత్రిమ మేధస్సు, డిజిటల్ మేన్యుఫాక్చరింగ్, బిగ్ డేటా అనలిసిస్ మరియు క్వాంటమ్ కమ్యూనికేషన్ లలో శిక్షణ, ఇంకా నైపుణ్యాల సంబంధిత పరిశోధనకు గాను ప్రావీణ్యతా కేంద్రాలకు మద్దతివ్వడం కోసం డిపార్ట్ మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక ‘మిషన్ ఆన్ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్’ ను ప్రారంభిస్తుంది.
టెలికం రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు మరియు ఆ సదుపాయాలను పెంపొందించేందుకు 2018-19 బడ్జెట్ లో 10,000 కోట్ల రూపాయలను కేటాయించారు. ప్రభుత్వం 5 లక్షల వైఫై హాట్ స్పాట్ లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఇవి 5 కోట్ల గ్రామీణ ప్రాంత పౌరులకు బ్రాడ్ బ్యాండ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తుంది. ఇప్పటికే భారత్ నెట్ ప్రాజెక్టు ఒకటో దశ లో 20 కోట్ల మందికి పైగా గ్రామీణ ప్రాంత భారతీయ పౌరులకు బ్రాడ్ బ్యాండ్ సౌకర్యాన్ని కల్పించినట్లు ఆర్థిక మంత్రి పార్లమెంట్ సభ్యుల దృష్టికి తీసుకువచ్చారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ప్రయత్నాలకు ఒక దిశను అందించేందుకుగాను నీతి ఆయోగ్ ఒక జాతీయ కార్యక్రమాన్ని మొదలుపెడుతుందని కూడా శ్రీ జైట్లీ ప్రకటించారు. నూతనంగా ఆవిర్భవిస్తున్న సాంకేతికతల తాలూకు ప్రయోజనాలను పొందేందుకు చెన్నై లోని ఐఐటి లో దేశీయంగా 5జి టెస్ట్ బెడ్ ను నెలకొల్పడంలో డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్ మద్దతు ఇస్తుంది.
చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఆర్థిక సహాయం అందించడంలో క్రిప్టో-అసెట్స్ ను వినియోగించడాన్ని నివారించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుంది. అలాగే, డిజిటల్ లావాదేవీలు ప్రధానంగా ఉండగల ఆర్థిక వ్యవస్థను ఆవిష్కరించడం కోసం బ్లాక్ చైన్ టెక్నాలజీ ని ఉపయోగించుకొనేందుకు ఉన్న అవకాశాలను సైతం ప్రభుత్వం అన్వేషిస్తుంది.
(Release ID: 1518834)