ఆర్థిక మంత్రిత్వ శాఖ
“ప్రి- నర్సరీ నుండి XII వ తరగతి వరకు విద్యను అవిభాజ్యమైందిగా పరిగణిస్తామ”ని తెలిపిన ఆర్థిక మంత్రి
రానున్న నాలుగు సంవత్సరాలలో పరిశోధన మరియు అవస్థాపన లకు అండదండలుగా ఉండేందుకు 1,00,000 కోట్ల రూపాయల నిధులతో ఒక కార్యక్రమం
Posted On:
01 FEB 2018 1:32PM by PIB Hyderabad
విద్య యొక్క నాణ్యతపై కేంద్ర ఆర్థిక శాఖ మరియు కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ అరుణ్ జైట్లీ ఆందోళనను వ్యక్తం చేస్తూ, ప్రి- నర్సరీ నుండి XII వ తరగతి వరకు విద్యను అవిభాజ్య తత్వ సంబంధమైందిగా పరిగణించనున్నట్లు తెలిపారు. 2018-19 సాధారణ బడ్జెట్ ను ఆర్థిక మంత్రి ఈ రోజు పార్లమెంటులో ప్రవేశపెడుతూ, విద్యా రంగంలో డిజిటల్ ఆధిక్యతకు పెద్ద పీట వేయాలని ప్రభుత్వం సంకల్పించిందని వెల్లడించారు. ‘‘ప్రభుత్వం ‘బ్లాక్ బోర్డు’ నుండి తొలగిపోయి ‘డిజిటల్ బోర్డు’ కు మళ్ళాలని ప్రతిపాదిస్తోంద’’ని ఆయన అన్నారు. విద్య యొక్క నాణ్యతను మెరుగుపరచడం కోసం జిల్లా వారీ వ్యూహాన్ని కూడా సిద్ధం చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి వివరించారు. ప్రముఖ విద్యా సంస్థలలో పరిశోధన మరియు మౌలిక సదుపాయాలకు సంబంధించిన పెట్టుబడిని పెంచాల్సిన అవసరం ఉందని ఆర్థిక మంత్రి స్పష్టం చేస్తూ, ‘‘రివైటలైజింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ సిస్టమ్స్ ఇన్ ఎజుకేశన్ (ఆర్ఐఎస్ఇ)’’ పేరిట ఒక ప్రధాన కార్యక్రమాన్ని ప్రారంభించే ప్రతిపాదన ఉన్నట్లు పేర్కొన్నారు. రాబోయే 4 సంవత్సరాలలో ఈ కార్యక్రమానికి మొత్తం 1,00,000 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెడుతున్నట్లు శ్రీ జైట్లీ వెల్లడించారు. ఉన్నత విద్యను గురించి శ్రీ జైట్లీ ప్రస్తావిస్తూ, ‘‘ప్రైమ్ మినిస్టర్స్ రిసర్చ్ ఫెలోస్ (పిఎమ్ఆర్ఎఫ్)’’ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.
ప్రతి ఏటా ప్రముఖ సంస్థల నుండి 1,000 మంది ఉత్తమ బి.టెక్. విద్యార్థులను గుర్తించి వారు ఐఐటి లలో మరియు ఐఐఎస్‌సి లో పిహెచ్.డి. చేసేందుకు వీలుగా ఒక ఆకర్షణీయమైన ఫెలో షిప్ ను అందజేయగలమని వివరించారు. సేవా కాలంలో ఉండగా ఉపాధ్యాయులకు శిక్షణను ఇవ్వడం ఒక కీలక ప్రాధాన్యం కలిగినటువంటి అంశంగా పేర్కొన్న ఆర్థిక మంత్రి, ఉపాధ్యాయుల కోసం ఒక సమగ్ర బి.ఎడ్. కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నిస్తామని కూడా పేర్కొన్నారు.
ఆదివాసి కుటుంబాల పిల్లలకు వారి సొంత పరిసరాలలోనే ఉత్తమైన, మన్నికైన విద్యను అందిచవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆర్థిక మంత్రి అన్నారు. ఈ కార్యక్రమాన్ని అమలులోకి తీసుకువచ్చేందుకు 2022 వ సంవత్సరం కల్లా 50 శాతానికి పైగా ఎస్‌టి జనాభా కలిగి ఉన్న మరియు కనీసం 20 వేల మంది ఆదివాసి వ్యక్తులు ఉన్న ప్రతి బ్లాకులో ‘‘ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్’’ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు శ్రీ జైట్లీ వివరించారు. ఏకలవ్య పాఠశాలలను నవోదయ విద్యాలయాలతో సమానంగా పరిగణించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ పాఠశాలలు స్థానిక కళలను, సంప్రదాయాలను పరిరక్షించడం కోసం ప్రత్యేక సదుపాయాలను కలిగి ఉండడంతో పాటు క్రీడలు మరియు నైపుణ్యాల అభివృద్ధిలో శిక్షణను కూడా అందిస్తాయని ఆయన అన్నారు.
‘ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఎమినెన్స్’ను నెలకొల్పే కార్యక్రమాన్ని గురించి మంత్రి శ్రీ జైట్లీ ప్రస్తావిస్తూ, ఇందుకోసం 100 కు పైగా దరఖాస్తులు అందినట్లు చెప్పారు. ‘‘వడోదరా లో ఒక ప్రత్యేక తరహా రైల్వేస్ యూనివర్సిటీ ని ఏర్పాటు చేసేందుకు కూడా మేం చర్యలు తీసుకొన్నామ’’ని తెలిపారు. ఐఐటి లలోను, ఎన్ఐటి లలోను 18 స్కూల్స్ ఆఫ్ ప్లానింగ్ & ఆర్కిటెక్చర్ (ఎస్‌పిఎ స్) ను కొత్తగా నెలకొల్పుతామని, ఇవి స్వతంత్ర ప్రతిపత్తితో కూడిన పాఠశాలలుగా ఉంటాయని ఆయన చెప్పారు.
వృద్ధులు, వితంతు మహిళలు, అనాథ బాలలు, దివ్యాంగులు మరియు సోషియో-ఇకనామిక్ కాస్ట్ సెన్సస్ నిర్వచించిన ప్రకారం సమాజంలో హోదా లేని వారితో కూడిన ప్రతి కుటుంబాన్ని ఆదుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆర్థిక మంత్రి చెప్తూ, ఒక సమగ్ర సామాజిక భద్రత మరియు రక్షణ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సంవత్సరం జాతీయ సామాజిక సహాయ కార్యక్రమానికి 9,975 కోట్ల రూపాయలను కేటాయించినట్లు వెల్లడించారు.
***
(Release ID: 1518774)
Visitor Counter : 94