సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

‘స్వచ్చ్ భారత్’ చిత్ర ప్రదర్శన ప్రారంభం: డిఎవిపి

Posted On: 29 JAN 2018 7:09PM by PIB Hyderabad
Press Release photo

దృశ్య ప్రకటన విభాగం, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, హైదరాబాద్ ఆఫీస్ మూడు రోజుల స్వచ్చ్ భారత్ చిత్ర ప్రదర్శనను కేంద్రీయ సదన్, కోఠి, హైదరాబాద్ లో  నేటి నుండి ఏర్పాటు చేశారు.   

 

 

ఈ చిత్ర ప్రదర్శనను NNSS రావుచీఫ్ ఇంజనీర్CPWD, జాయింట్ డైరెక్టర్ దేవేంద్ర, DFP, సూపెరిండేంట్  ఇంజనీర్ కనకరాజు, CPWD  అసిస్టెంట్ డైరెక్టర్ హరిబాబుఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ భారత లక్ష్మి సమక్షంలో  రిబ్బన్ కట్ చేసి,  జ్యోతి ప్రజ్వలనతో  లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన  మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం స్వచ్చ్ భారత్ ఉద్యమాన్ని ఎంతో  మంచి ఆలోచనతో ఆరంభించింది.  మనం అందరం కలిసి గాంధీజీ 150 జయంతి సందర్బంగా మహాత్ముడికి 
స్వచ్చ్ భారత్ ను అంకితం చేయాలి. అప్పుడే మన ప్రధాని మోదీ గారి 
‘న్యూ ఇండియా’ ను మనం సాకారం చేసుకోగము.  CPWD తమ కార్యాలయంలో స్వచ్చ్ భారత్ ను చాలా  నిష్ఠగా పాటిస్తుంది. ప్రజలు పరిశుభ్రత  అలవర్చుకోవాలిదేశాన్ని అనారోగ్య ముక్తి  చేయాలి అని అన్నారు.  ఇలాంటి చిత్ర  ప్రదర్శనను ఏర్పాటు చేసిన  DAVP ని అభినందించారు.   ఫీల్డ్  Exhibition   ఆఫీసర్ సురేష్ ధర్మపురి మాట్లాడుతూ, పక్షం రోజుల స్వచ్ఛ  పక్వాడ్ (పక్షం రోజుల స్వచ్ఛ కార్యక్రమం)లో భాగంగా క్షేత్ర ప్రదర్శన కార్యాలయం ఈ మూడు రోజుల చిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేసింది. ప్రజల్లోఉద్యోగుల్లో పరిశుభ్రత పై అవగాహనా కల్పించే ఉదేశ్యంతో చిత్ర ప్రదర్శన ను ఏర్పాటు చేశామన్నారు.   ఈ కార్యక్రమంలో ఫీల్డ్  ఎగ్జిబిషన్ అసిస్టెంట్ శ్రీనివాస్ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

 

****

 



(Release ID: 1518258) Visitor Counter : 198


Read this release in: English