ప్రధాన మంత్రి కార్యాలయం

జనవరి 28న ప్రధాని మనసులో మాట కార్యక్రమం

Posted On: 25 JAN 2018 6:41PM by PIB Hyderabad

భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ తన మనసులోని మాటల్ని దేశ ప్రజలతో పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్”, జనవరి 28(ఆదివారం) ఉదయం 11 గంటలకు  దేశవ్యాప్తంగా అన్ని ఆకాశవాణి కేంద్రాలలో ఒకే సమయంలో ప్రసారం కానుంది. ఈ ప్రసారాన్ని ఆల్ ఇండియా రేడియో,   ఎఫ్.ఎమ్ గోల్డ్ఉర్దూ సర్వీస్ మాధ్యమాల ద్వారా కూడా ఇదే సమయంలో వినవచ్చు. దూరదర్శన్ ఛానళ్ళుడీ.డీ. నేషనల్డీ.డీ. న్యూస్డీ.డీ. భారతి ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి.

 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మన్ కీ బాత్” ద్వారా ప్రసంగించిన వెంటనేఆకాశవాణి ఆంధ్రప్రదేశ్తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాల ద్వారా మన్ కీ బాత్” తెలుగు అనువాదాన్ని ప్రసారం చేస్తుంది.  తిరిగి మన్ కీ బాత్” తెలుగు అనువాదం   అదే రోజు రాత్రి 8 గంటలకు తెలంగాణఆంధ్రప్రదేశ్ లలోని అన్ని ఆకాశవాణి కేంద్రాల వివిధ భారతిఎఫ్.ఎమ్ రెయిన్ బో కేంద్రాలు ప్రసారం చేస్తాయనిఆకాశవాణి ప్రోగ్రామ్ అధికారి శ్రీ ఎమ్. రామారావు తెలిపారు.

 

*****


(Release ID: 1517928) Visitor Counter : 259


Read this release in: English