PIB Headquarters
జనవరి 24వ తేదీన హైదరాబాద్ లో 96 వ రాష్ట్ర స్థాయి డాక్ అదాలత్
प्रविष्टि तिथि:
11 JAN 2018 6:36PM by PIB Hyderabad
తపాలా సేవలకు సంబంధించి ప్రజా సమస్యలను మరియు ఫిర్యాదులను స్వీకరించడం కోసం హైదరాబాద్ లోని తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ 2018 జనవరి 24వ తేదీన 96వ డాక్ అదాలత్ ను నిర్వహించనున్నారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ కార్యాలయంలో ఈ కార్యక్రమం ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు దీనికి సంబంధించి వారి కష్టాలను, ఫిర్యాదులను ఈ నెల 19వ తేదీ లోపు శ్రీ కె. వెంకట రామిరెడ్డి, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ జనరల్, ఆఫీస్ ఆఫ్ ది చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్, తెలంగాణ సర్కిల్, హైదరాబాద్ 500 001 కి పంపాలని భారత ప్రభుత్వ తపాలా విభాగం తెలంగాణ సర్కిల్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
***
(रिलीज़ आईडी: 1516439)
आगंतुक पटल : 184
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English