మంత్రిమండలి
నేషనల్ ట్రస్ట్ ఛైర్ పర్సన్ కు మరియు సభ్యులకు నిర్ణీత పదవీకాలానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం
Posted On:
10 JAN 2018 1:09PM by PIB Hyderabad
1999 నాటి నేషనల్ ట్రస్ట్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ పర్సన్ విత్ ఆటిజమ్, సెరిబ్రల్ పాల్సీ, మెంటల్ రిటార్‌డేశన్ అండ్ మల్టిపుల్ డిసబిలిటీస్ యాక్ట్, 1999 లోని 4 (1) సెక్షన్ ను, ఇంకా 5 (1) సెక్షన్ ను సవరించి, ఆ ట్రస్టు బోర్డు యొక్క ఛైర్ పర్సన్ తో పాటు బోర్డు సభ్యుల పదవీకాలాన్ని 3 సంవత్సరాలకు నిర్ధారించే ప్రతిపాదనకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
1999 నాటి నేషనల్ ట్రస్ట్ యాక్ట్ లోని 4(1) సెక్షన్ ప్రకారం బోర్డ్ ఆఫ్ నేషనల్ ట్రస్ట్ యొక్క ఛైర్ పర్సన్ లేదా బోర్డు లోని ఎవరైనా సభ్యుడు వారి ఉత్తరాధికారిని యథోచితంగా నియమించేటంతవరకు, వారే 3 సంవత్సరాల నిర్ణీత కాలానికి అతీతంగా పదవిలో కొనసాగేందుకు వెసులుబాటు ఉంది. ఒకవేళ ఛైర్ పర్సన్ రాజీనామా చేసిన పక్షంలో, ఉత్తరాధికారిని ప్రభుత్వం యథోచితంగా నియమించేటంత వరకు, చైర్ పర్సనే పదవిలో కొనసాగేందుకు చట్టంలోని 5(1) సెక్షన్ ప్రకారం వీలు ఉంది. చట్టం లోని పైన పేర్కొన్న నిబంధనల ప్రస్తుత పదజాలం- నియామకానికి అర్హులైన తగిన ఉన్నతాధికారిని కనుగొన లేకపోయిన కారణంగా- ఛైర్మన్ నిరవధికంగా కొనసాగేందుకు దారి తీసింది. ఈ చట్ట నిబంధనలలో ప్రతిపాదించినటువంటి సవరణలు సదరు పరిస్థితిని నివారించదలుస్తున్నాయి. తద్వారా, ప్రస్తుతం పదవిలో ఉన్న వారు అదే పదవిలో సుదీర్ఘ కాలం పాటు కొనసాగేటటువంటి ఏ అవకాశాన్నైనా ఈ సవరణలు పరిహరించగలవు.
*****
(Release ID: 1516255)
Visitor Counter : 143