విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
భూ సరిహద్దు అతిక్రమణ అంశంపై భారతదేశం మరియు మయన్మార్ ల మధ్య ఒప్పందానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం
Posted On:
03 JAN 2018 2:40PM by PIB Hyderabad
భూ సరిహద్దు అతిక్రమణ అంశంపై భారతదేశానికి, మయన్మార్ కు మధ్య ఒప్పందానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఈ ఒప్పందం ఉభయ దేశాలలో సరిహద్దు ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలకు స్వేచ్ఛగా రాకపోకలు జరిపేందుకు ప్రస్తుతం ఉన్నటువంటి హక్కులలో పొందికకు మరియు ఆ హక్కుల యొక్క క్రమబద్దీకరణకు మార్గాన్ని సుగమం చేస్తుంది. అంతేకాకుండా, ఇది చెల్లుబాటయ్యే పాస్‌పోర్టు లు మరియు వీజా ల సాయంతో ప్రజలు రాకపోకలు జరిపేందుకు కూడా సహకరిస్తుంది. ఈ కారణంగా, రెండు దేశాల మధ్య సామాజిక బంధం, ఆర్థిక బంధం పెంపొందగలవు.
ఈ ఒప్పందం భారతదేశం- మయన్మార్ సరిహద్దు వెంబడి ప్రజల రాకపోకలను సులభతరం చేస్తుంది. మయన్మార్ ప్రజలతో భారతదేశం లోని ఈశాన్య ప్రాంతాల రాష్ట్రాల ప్రజల అనుసంధానాన్ని ఈ ఒప్పందం ఇనుమడింప చేయగలదని, ఆయా వర్గాల మధ్య సంబంధాలను పెంచుతుందని ఆశిస్తున్నారు.
ఈశాన్య ప్రాంత ఆర్థిక వ్యవస్థ కు ఈ ఒప్పందం ఉత్తేజాన్నివ్వగలుగుతుంది. అలాగే, మయన్మార్ తో మన దేశానికి ఉన్న భౌగోళిక సంబంధాల ప్రాతిపదికన వ్యాపారాన్ని మరియు ప్రజా సంబంధాలను అభివృద్ధిపరచుకోవడానికి కూడా తోడ్పడగలదు.
భూ సరిహద్దు వెంబడి పెద్ద సంఖ్యలో నివసిస్తున్నటువంటి మరియు సరిహద్దు ప్రాంతం వెంబడి స్వేచ్ఛగా రాకపోకలు జరపడానికి అలావాటు పడినటువంటి ఆదివాసీ సముదాయాలకు ఉన్న సాంప్రదాయక హక్కులను ఈ ఒప్పందం పరిరక్షించగలదు.
***
(Release ID: 1515364)
Visitor Counter : 118