రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

భార‌త‌దేశంలో సార్వజనిక ర‌వాణా మెరుగుద‌ల‌కు భార‌త‌దేశం మ‌రియు యునైటెడ్ కింగ్ డ‌మ్ కు చెందిన ‘ట్రాన్స్‌పోర్ట్ ఫ‌ర్ లండ‌న్‌’ కు మ‌ధ్య ఎంఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం

Posted On: 03 JAN 2018 2:38PM by PIB Hyderabad

భార‌త‌దేశంలో సార్వజనిక ర‌వాణా ను మెరుగుప‌ర‌చ‌డం కోసం కేంద్ర ర‌హ‌దారి ర‌వాణా & హైవేల మంత్రిత్వ శాఖ‌కు మ‌రియు 1999 నాటి గ్రేటర్ లండ‌న్ అథారిటీ యాక్ట్ (యుకె) లో భాగంగా ఏర్పాటైన చ‌ట్ట‌బ‌ద్ధ సంస్థ ‘ట్రాన్స్‌పోర్ట్ ఫ‌ర్ లండ‌న్‌’ కు మ‌ధ్య అవ‌గాహ‌నపూర్వ‌క ఒప్పందం (ఎమ్ఒయు)పై సంత‌కాల‌కు, ఈ ఎమ్ఒయు అమ‌లుకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది.

ఈ ఎంఒయు దేశంలో మొత్తంమీద సార్వజనిక ర‌వాణా వ్య‌వ‌స్థతో పాటు ప్ర‌యాణికుల సంబంధిత సేవ‌ల‌ను మెరుగుప‌ర‌చ‌డంలో తోడ్పాటును అందించ‌డ‌మే కాకుండా భార‌త‌దేశంలో అధిక సామ‌ర్ధ్యం క‌లిగిన బ‌స్సుల వినియోగాన్ని కూడా ప్రోత్స‌హించగలదు.  యునైటెడ్ కింగ్ డ‌మ్ కు మ‌రియు ఇండియా కు మ‌ధ్య ద్వైపాక్షిక సంబంధాల‌ను ప‌టిష్ట‌ప‌ర‌చి, ప్రోత్స‌హించ‌డంలో కూడా ఇది ప్రముఖ పాత్రను పోషించగలుగుతుంది.

అంద‌రి కోసం ఉద్దేశించినటువంటి ఒక సమగ్రమైన సార్వజనిక ర‌వాణా వ్య‌వ‌స్థ‌ ను బ‌లోపేతం చేయ‌డంలో ఈ ఎంఒయు తోడ్పడుతుంది.   స‌మాజంలో నిరుపేద వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు ఒక గుణాత్మ‌క‌ సార్వజనిక ర‌వాణా వ్య‌వ‌స్థ‌ను అందుబాటులోకి తీసుకురావ‌డానికి ఈ ఎంఒయు దోహదం చేయగలదు.


***


(Release ID: 1515361) Visitor Counter : 121
Read this release in: English , Kannada