నౌకారవాణా మంత్రిత్వ శాఖ

ప్ర‌ధాన పోర్టుల‌లో పిపిపి ప్రాజెక్టుల కోసం స‌వ‌రించిన న‌మూనా రాయితీ ఒప్పందానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం

Posted On: 03 JAN 2018 2:36PM by PIB Hyderabad

పోర్టుల రంగంలో పెట్టుబ‌డి వాతావ‌ర‌ణాన్ని మ‌రింత ఆక‌ర్ష‌ణీయంగా మలచేందుకు మరియు పోర్టు ప్రాజెక్టులను పెట్టుబ‌డి పెట్టే వారికి మ‌రింత ప్రోత్సాహ‌క‌రంగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన న‌మూనా రాయితీ ఒప్పందంలో (ఎంసిఎ) స‌వ‌ర‌ణ‌ల‌కు ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.

ముఖ్యాంశాలు:

ఎంసిఎ లో స‌వ‌ర‌ణ‌లు.. హైవేల రంగంలో ఉన్న‌ట్టుగా వివాదాల ప‌రిష్కారానికి  పోర్టుల- వివాదాల ప‌రిష్కారాల సంఘం (ఎస్‌ఎఆర్‌ఒడి- పోర్ట్స్‌) ఏర్పాటుకు వీలు క‌ల్పిస్తాయి.

స‌వ‌రించిన ఎంసిఎ లో ముఖ్యాంశాలు:-

1)  ప‌ని చేప‌ట్టిన నాటి నుండి రెండు సంవ‌త్స‌రాల త‌రువాత డివెల‌ప‌ర్ త‌న వాటాను 100 శాతం వ‌ర‌కు పెట్టుబ‌డి ఉప‌సంహ‌ర‌ణ కింద విర‌మించుకోవ‌డానికి ఇది డివెల‌ప‌ర్ల‌కు వీలు క‌ల్పిస్తుంది.  హైవేస్ సెక్టర్ లో ఉన్న ఎంసిఎ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా ఇవి ఉన్నాయి. 

2)  రాయితీదారుకు అద‌న‌పు భూమి ప్రొవిజ‌న్ కింద‌, భూమి అద్దెను  ప్ర‌తిపాదిత అద‌న‌పు భూమికి వ‌ర్తించే రేట్లలో 200 శాతం నుండి 120 శాతానికి త‌గ్గించారు.

3)  రాయితీదారు ఒక్కో మెట్రిక్ ట‌న్ను కార్గో లేదా టిఇయు లావాదేవీల  ప్రాతిప‌దిక‌న రాయ‌ల్టీని చెల్లించాలి. దీనిని డ‌బ్ల్యుపిఐ వార్షిక తేడాల‌లో ఇండెక్స్ చేస్తారు.  ఇది ప్ర‌స్తుతం చెల్లిస్తున్న విధానానికి బ‌దులుగా అమ‌లులోకి వ‌స్తుంది. పాత ప‌ద్ధ‌తిలో బిడ్డింగ్ సంద‌ర్భంగా సూచించిన‌, టారిఫ్ అథారిటీ ఫ‌ర్ మేజ‌ర్ పోర్ట్స్ (టిఎఎంపి) లెక్కించిన నార్మ‌ేటివ్ టారిఫ్ సీలింగ్‌కు అనుగుణంగా స్థూల రాబ‌డి శాతానికి స‌మానంగా రాయ‌ల్టీ విధించే వారు. 

ప‌బ్లిక్‌, ప్రైవేట్ పార్టిసిపేశన్ ఆప‌రేట‌ర్ల‌కు  సంబంధించి ఎంతో కాలంగా ఉన్న ఫిర్యాదుల ప‌రిష్కారానికి ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది.  రెవిన్యూ వాటాను సీలింగ్ టారిఫ్‌పై చెల్లించాల్సి ఉండ‌గా, ప్రైస్ డిస్కౌంట్‌ ల‌ను వ‌దలివేసే ప‌ద్ధ‌తి ఉండేది.  టిఎఎంపి చే స్టోరేజ్ చార్జీల నిర్ణ‌యం, స్టోరేజ్ చార్జీల‌పై రెవిన్యూ వాటా కార‌ణంగా చాలా ప్రాజెక్టులు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి.  ఇప్ప‌డు ఈ ఇబ్బందులు తొల‌గిపోతాయి.

4.  రాయితీని పొందిన వారు ఉన్న‌త‌ సామ‌ర్ధ్యం క‌ల ప‌రిక‌రాలు, సౌక‌ర్యాలు, సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని అందుబాటులొకి తెచ్చుకోవ‌చ్చు.  ప్రాజెక్టు ఆస్తుల ఖ‌ర్చు త‌గ్గించుకొనే క్ర‌మంలో వాడ‌కాన్ని ఉత్పాద‌క‌త‌ను పెంచుకొనే క్ర‌మంలో వేల్యూ ఇంజినీయరింగ్‌ ను చేప‌ట్ట‌వ‌చ్చు.

5.   వాస్త‌వ ప్రాజ‌ెక్టు వ్యంయం స్థానంలో  మొత్తం ప్రాజెక్టు వ్య‌యం వ‌చ్చి చేరుతుంది.

6.   చ‌ట్టంలో మార్పునకు కొత్త నిర్వ‌చ‌నం ఉంటుంది. అందులో..
 
ఎ.   ప్ర‌మాణాల నిర్ణ‌యం, టిఎఎంపి మార్గ‌ద‌ర్శ‌కాలు, ఉత్త‌ర్వులు, ప‌ర్యావ‌ర‌ణ చ‌ట్టాలు, కార్మిక చ‌ట్టాల  కార‌ణంగా త‌లెత్తే ప‌రిస్థితులు; 

బి.  రాయితీదారుకు ప‌రిహారం అందించేందుకు సుంకాలు, కొత్త ప‌న్నుల విధింపు, పెంపు ఉంటాయి.  ప్రాజెక్టు అమ‌లుపై ప్ర‌భావం ప‌డింది క‌నుక‌, రాయితీదారుకు కొత్త ప‌న్నులు విధింపు, సుంకాలు త‌దిత‌రాల ద్వారా ప‌రిహారం అందిస్తారు.  అయితే కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు విధించే/ పెంచే ప్ర‌త్య‌క్ష ప‌న్ను ఇందుకు మిన‌హాయింపు.

7.   సిఒడి కి ముందే కార్య‌క‌లాపాలు ప్రారంభించేందుకు ఏర్పాటు. దీనివ‌ల్ల పోర్టు స‌మ‌కూర్చే ఆస్తుల‌ను-  లాంఛ‌నంగా అవి పూర్త‌యిన‌ట్టు స‌ర్టిఫికెట్ వ‌చ్చే లోగా- ప‌లు ప్రాజెక్టుల‌లో మ‌రింత‌ మెరుగుగా వినియోగించేందుకు ఉప‌క‌రిస్తుంది.

8.   ప్రాజెక్టుల ఆర్థిక వెసులుబాటును మ‌రింత మెరుగుప‌రచే దిశ‌గా రాయితీదారుకు త‌క్కువ ఖ‌ర్చు కాగ‌ల దీర్ఘ‌కాలిక ట‌ర్మ్ ఫండ్‌లు అందుబాటులోకి వ‌చ్చే విధంగా రీఫైనాన్సింగ్‌కు ఏర్పాటు;

9.   ఎస్‌ఎఆర్ఒడి- పోర్ట్స్ ప్రొవిజ‌న్‌ను ప్ర‌స్తుత రాయితీదారు ఫిర్యాదుల ప‌రిష్కారానికి కూడా వ‌ర్తింపచేసేందుకు క‌న్సెశనింగ్ అథారిటీ ల మ‌ధ్య అనుబంధ ఒప్పందాన్నివ‌ర్తింప‌చేయ‌డం;

10.   పోర్టు వినియోగ‌దారుల‌కు  ఫిర్యాదుల పోర్ట‌ల్‌ను అందుబాటులోకి తీసుకురావ‌డం;

11.   ప్రాజెక్టు అమ‌లుకు సంబంధించిన స్థాయీ నివేదిక‌ను తెలియ‌బ‌రచేటట్టు ప‌ర్య‌వేక్ష‌క వ్య‌వ‌స్థ ను ప్ర‌వేశ‌పెట్ట‌డం;

గ‌త 20 సంవ‌త్స‌రాల‌లో పోర్టు రంగంలో పిపిపి ప్రాజెక్టుల నిర్వ‌హ‌ణ‌లో గ‌డించిన అనుభ‌వాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ స‌వ‌ర‌ణ‌లను ప్ర‌తిపాదించడం జరిగింది.   వీటిని ప్ర‌స్తుత ఎంసిఎ నిబంధ‌న‌ల వ‌ల్ల ఎదురవుతున్న స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించేందుకు తీసుకువ‌చ్చారు.
 
సంబంధిత వ‌ర్గాల‌తో విస్త్రృతంగా సంప్ర‌దింపులు జ‌రిపిన తరువాతే ఎంసిఎ కు స‌వ‌ర‌ణ‌లను ఖ‌రారు చేయ‌డమైంది.

***



(Release ID: 1515358) Visitor Counter : 87


Read this release in: English , Kannada