ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ఆరోగ్యం మరియు వైద్య రంగంలో సహకారం కోసం భారతదేశానికి మరియు ఇటలీ కి మధ్య ఎమ్ఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

Posted On: 20 DEC 2017 8:02PM by PIB Hyderabad

ఆరోగ్యం మరియు వైద్య రంగంలో భారతదేశానికి, ఇటలీ కి మధ్య సహకారానికి సంబంధించిన ఒక అవగాహనపూర్వక ఒప్పంద పత్రానికి (ఎమ్ఒయు కు) ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఎక్స్-పోస్ట్-ఫ్యాక్టో ఆమోదం తెలిపింది.  ఈ ఎమ్ఒయు పైన 2017 నవంబర్ 29వ తేదీన న్యూ ఢిల్లీ లో సంతకాలయ్యాయి.

ఈ ఎమ్ఒయు ఈ కింద పేర్కొన్న రంగాలలో సహకారానికి వీలు కల్పిస్తుంది:-

1.                  వైద్యులు, అధికారులు ఆరోగ్య రంగం లోని ఇతర వృత్తి నిపుణులు, ఇంకా నిపుణుల రాకపోకలు, మరియు శిక్షణ;
2.    మానవ వనరుల అభివృద్ధి, ఆరోగ్య సేవల వికాసం తో పాటు ఆరోగ్య సంరక్షణ సదుపాయాల స్థాపనలో సహాయం;
3.                  ఆరోగ్య రంగంలోని మానవ వనరులకు స్వల్పకాలిక శిక్షణను సమకూర్చడం;
4.                  ఫార్మాస్యూటికల్స్, వైద్య పరికరాలు మరియు అలంకరణ సామగ్రి సంబంధిత నియంత్రణ మరియు తత్సంబంధ సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడం;
5.                  ఫార్మాస్యూటికల్స్ రంగంలో వ్యాపారాభివృద్ధి పరమైన అవకాశాలను ప్రోత్సహించడం;
6.               జనరిక్ మరియు అత్యవసర ఔషధాల సేకరణలో, డ్రగ్ సప్లయిల సోర్సింగ్ లో సహాయం;
7.                  ఆరోగ్య సంబంధిత సామగ్రి మరియు ఫార్మాస్యూటికల్ ఉత్పత్తుల సేకరణ;
8.             పరస్పర ప్రయోజనం ముడిపడివుండే.. న్యూరోకార్డియోవాస్కులర్ డిజీజెస్, కేన్సర్, సిఒపిడి లు, మానసిక ఆరోగ్యం మరియు చిత్త వైకల్యం ల వంటి ఎన్ సిడి లతో పాటు; ఎస్ డిజి3 పైనా, తత్సంబంధిత కారణాల.. నిరోధం లోను;
9.             సాంక్రమిక వ్యాధులపైన మరియు వెక్టర్ బార్న్ డిజీజెస్ జలవాయు పరివర్తన రంగ ప్రభావాన్ని అంచనా వేయడంలో సహకారం;
10.            ఎస్ డిజి2 వెలుగులో ఆహారం తీసుకోవడానికి సంబంధించిన పోషక కోణాలు, పోషకాహార లోపం సహా (ఎక్కువ స్థాయిలో పోషణను మరియు తక్కువ స్థాయిలో పోషణను కలుపుకొని) ఇంకా పోషణ సేవల నిర్వహణ;
11.             ఉత్పత్తి యొక్క భద్రత, పరివర్తన, పంపిణీ మరియు ఆహారం సరఫరా;
12.              పరిశోధన మరియు ఆహార పరిశ్రమ ఆపరేటర్ల శిక్షణ;
13.              ఆరోగ్య రక్షణ మరియు ఆహార భద్రత, ఇంకా ఆరోగ్యకరమైన భోజన అలవాట్లపై పౌరులకు సమాచారం అందించడం మరియు సందేశాలు ఇవ్వడం; మరియు
14.              పరస్పరం నిర్ణయించుకొనే మేరకు మరే ఇతర రంగంలోనైనా సహకారం.

ఈ అవగాహనపూర్వక ఒప్పందం (ఎమ్ఒయు ) అమలును పర్యవేక్షించేందుకు, సహకారానికి సంబంధించిన వివరాలను విస్తరింపచేసేందుకు  ఒక సంయుక్త కార్యాచరణ బృందాన్ని (జెడబ్ల్యుజి ని) ఏర్పాటు చేస్తారు.

 



(Release ID: 1513780) Visitor Counter : 71


Read this release in: English , Kannada