ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ఆరోగ్యం మరియు వైద్య రంగంలో సహకారం కోసం భారతదేశానికి, క్యూబా కు మధ్య ఎమ్ఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

Posted On: 20 DEC 2017 8:03PM by PIB Hyderabad

ఆరోగ్యం మరియు వైద్య రంగంలో భారతదేశానికి, క్యూబా కు మధ్య సహకారానికి సంబంధించిన ఒక అవగాహనపూర్వక ఒప్పంద పత్రానికి (ఎమ్ఒయు కు) ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఎక్స్-పోస్ట్-ఫ్యాక్టో ఆమోదం తెలిపింది. ఈ ఎమ్ఒయు పైన 2017 డిసెంబర్ 06వ తేదీన న్యూ ఢిల్లీ లో సంతకాలయ్యాయి.

 

ఈ ఎమ్ఒయు ఈ కింద పేర్కొన్న రంగాలలో సహకారానికి వీలు కల్పిస్తుంది:-

 

ఎ. వైద్యులు, అధికారులు ఇతర ఆరోగ్య రంగ వృత్తినిపుణులు, ఇంకా నిపుణుల రాకపోకలు, మరియు శిక్షణ;

బి. మానవ వనరుల అభివృద్ధి, ఆరోగ్య సేవల వికాసం తో పాటు ఆరోగ్య సంరక్షణ సదుపాయాల స్థాపనలో సహాయం;

సి. ఆరోగ్య రంగంలో మానవ వనరులకు స్వల్పకాలిక శిక్షణను సమకూర్చడం;

డి. ఫార్మాస్యూటికల్స్, వైద్య పరికరాల సంబంధిత నియంత్రణ మరియు సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడం;

ఇ. ఫార్మాస్యూటికల్స్ రంగంలోను, ఇంకా ఇరు పక్షాలు గుర్తించినటువంటి ఇతర రంగాలలోను వ్యాపార అభివృద్ధి సంబంధ సహాయం;

ఎఫ్. జనరిక్ మరియు అత్యవసర ఔషధాల సేకరణలో, డ్రగ్ సప్లయిల సోర్సింగ్ లో సహాయం;

జి. ఆరోగ్య సంబంధిత సామగ్రి మరియు ఫార్మాస్యూటికల్ ఉత్పత్తుల సేకరణ;

హెచ్. పరస్పరం అంగీకారం కుదిరే మేరకు మరే ఇతర రంగంలోనైనా సహకారం;

ఈ ఎమ్ఒయు అమలును పర్యవేహక్షించేందుకు మరియు సహకారానికి సంబంధించిన వివరాలను విస్తరింపచేయడానికి ఒక సంయుక్త కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేస్తారు.

 

 

 

***



(Release ID: 1513531) Visitor Counter : 87


Read this release in: English , Kannada