హోం మంత్రిత్వ శాఖ
సశస్త్ర సీమా బల్ లో గ్రూప్ ‘ఎ’ ఎగ్జిక్యూటివ్ అధికారుల కాడర్ రివ్యూ తో పాటు సెంట్రల్ గ్రూప్ ‘ఎ’ సర్వీస్ ప్రదానానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం
Posted On:
20 DEC 2017 8:01PM by PIB Hyderabad
సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్ బి) నిర్వహణ, పాలన పరమైన సామర్థ్యాలను ఇనుమడింపచేసేందుకుగాను అసిస్టెంట్ కమాండెంట్ నుండి ఇన్ స్పెక్టర్ జనరల్ ర్యాంకుల వరకు వేరు వేరు ర్యాంకులలో నికరంగా 19 పదవులను సృష్టించేందుకుగాను ఎస్ఎస్ బి లోని గ్రూప్ ‘ఎ’ ఎగ్జిక్యూటివ్ అధికారుల కాడర్ రివ్యూ తో పాటు సెంట్రల్ గ్రూప్ ‘ఎ’ సర్వీస్ ప్రదానానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
గ్రూప్ ‘ఎ’ పదవుల స్వరూపం ప్రస్తుతమున్న 1253 నుండి 1272 కు ఈ కింద పేర్కొన్న విధంగా పెరగనుంది:
1. ఇన్ స్పెక్టర్ జనరల్ (ఎస్ఎజి స్థాయి) పదవులలో 2 పోస్టుల మేర పెరుగుదల.
2. డిఐజి/ కమాండెంట్ (జెఎజి స్థాయి) పదవులలో 11 పోస్టుల మేర నికర పెరుగుదల
3. డిసి (ఎస్ టిఎస్ స్థాయి) పదవులలో 2 పోస్టుల పెరుగుదల.
4. ఎస్ (జెటిఎస్ స్థాయి) పదవులలో 4 పోస్టుల పెరుగుదల.
పూర్వరంగం:
సరిహద్దు ప్రాంతాల జనాభాలో జాతీయ చైతన్యాన్ని, భద్రత పట్ల అవగాహనను వ్యాప్తి చేయడం కోసం 1963 వ సంవత్సరంలో ఎస్ఎస్ బి ని ఏర్పాటు చేశారు. 2001వ సంవత్సరంలో ఎమ్ హెచ్ఎ కు బదలాయించిన తరువాత, ఇండో- నేపాల్ సరిహద్దును, ఇండో- భూటాన్ సరిహద్దులను కావలి కాసే బాధ్యతను దీనికి అప్పగించారు. అస్సాంలో, జమ్ము & కశ్మీర్ లో కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ విధులతో పాటు వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో కూడా ఎస్ఎస్ బి ని మోహరించడమైంది. ప్రస్తుతం ఈ దళం యొక్క అనుమతించిన సంఖ్య 96,093. ఇందులో 2 ఎన్ డిఆర్ఎఫ్ బెటాలియన్ లు సహా మొత్తం 73 బెటాలియన్ లు ఉన్నాయి. అంతక్రితం 2005వ, 2010వ మరియు 2011వ సంవత్సరాలలో సంఖ్యను పెంచడం మరియు నిర్మాణక్రమాత్మక కసరత్తును చేపట్టడం వంటివి జరిగాయి.
***
(Release ID: 1513529)